India XI vs Pakistan: ఆ సీనియర్ స్పిన్నర్‌కు షాకిచ్చిన వసీం జాఫర్.. పంత్‌పైనే సందేహం!

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాయాదీల సమరం భారత్ X పాకిస్థాన్‌కు రంగం సిద్దమైంది. మరో 48 గంటల్లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో దాయాదీ దేశాలు తలపడనున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభావానికి రెండింతల ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్ భావిస్తుండగా.. అదే జోరును కొనసాగించి మరోసారి దిమ్మతిరిగే షాకివ్వాలని పాక్ అనుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టు ఎలా ఉండబోతుందనేది అభిమానులను టెన్షన్‌కు గురి చేస్తోంది.
రవిబిష్ణోయ్‌కు చోటు..
ఇప్పటికే మాజీ క్రికెటర్లు తమ తుది జట్టు అంచనాలను వెల్లడించారు. టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్విటర్ వేదికగా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. దాదాపు అందరూ ఊహించే ఆటగాళ్లనే ఎంచుకున్న వసీం జాఫర్.. రెండో స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌కు బదులు యువ ప్లేయర్ రవిబిష్ణోయ్‌కు చోటిచ్చాడు. అంతేకాకుండా దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌లలో ఒకర్ని తీసుకోవాలని పేర్కొన్నాడు. పంత్‌కు జట్టులో చోటు దక్కడంపై సందేహం వ్యక్తం చేశాడు.

ఓపెనర్లుగా రాహుల్, రోహిత్..
అందరూ భావిస్తున్నట్లే వసీం జాఫర్ సైతం కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగుతాడని చెప్పాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం ఉందన్నాడు. ఐదో స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతాడని పేర్కొన్న వసీం జాఫర్.. ఆరో స్థానంలో మాత్రం పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి చోటు దక్కుతుందన్నాడు. ఏడో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడుతాడని, 8వ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఆడుతాడని పేర్కొన్నాడు.

ఇద్దరు పేసర్లే..
భువీకి అండగా అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగుతాడని చెప్పిన జాఫర్.. మూడో పేసర్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు నిర్వర్తిస్తాడని చెప్పాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్‌లకు చోటు దక్కుతుందని అంచనా వేసాడు. వీరికి అండగా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఉంటాడని, మొత్తం ఇద్దరు ఆల్‌రౌండర్లతో కలిపి ఆరుగురు బౌలింగ్ చేస్తారని చెప్పాడు. దుబాయ్ పిచ్‌లు నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు ఉండేలా భారత్ టీమ్‌ను ఎంచుకునే అవకాశం ఉందని చెప్పాడు.

వసీం జాఫర్ భారత్ తుది జట్టు(అంచనా):
1. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్/రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications