14 ఏళ్ల కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ భయ్యా.. నిజంగా పిచ్చెక్కింది: విరాట్ కోహ్లీ

దుబాయ్: సుమారు నెల రోజుల పాటు ఆటకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఆసియాకప్ 2022 టోర్నీతో బరిలోకి దిగుతున్నాడు. పేలవ ఫామ్ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్‌తో ఆదివారం జరగబోయే మ్యాచ్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఇలా నెల రోజుల పాటు బ్యాట్ పట్టకపోవడం తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలిసారని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇలా ఆటకు దూరంగా ఉండటంతో తనకు పిచ్చెక్కిందని, మానసికంగా చాలా కుంగిపోయానన్నాడు. ఇలా చెప్పుకోవడానికి తానేం సిగ్గుపడటం లేదని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన విరాట్ హార్ట్ టూ హార్ట్ కార్యక్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఆటపై ఉన్న ప్రేమనే..
'ప్రతీరోజూ నిద్రలేవగానే ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దామనుకునే వ్యక్తిని నేను. నేను ఏ పని చేసినా పూర్తి వివేకంతో సంతోషంగా చేస్తా. ఎప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడతా.. గ్రౌండ్ లో నేను ఎప్పుడూ దూకుడుగా ఉంటా. అలా ఎలా సాధ్యం అని అందరూ అడుగుతుంటారు. బయిట ఉన్నవాళ్లే కాదు, నా సహచర ఆటగాళ్లు సైతం పదే పదే ప్రశ్నిస్తుంటారు. వారికి నేను చెప్పే సమాధానం ఒకటే.. నాకు ఆటమీదున్న ప్రేమ. నేను ఆడే ప్రతి బంతితో నా జట్టుకు మేలు జరగాలని భావిస్తా. అందుకే గ్రౌండ్‌లో నా సాయశక్తులా కృషి చేస్తా. బయిట చూసేవాళ్లకు ఇది అసాధారణమేమో. నాకైతే కాదు. నా జట్టును గెలిపించుకోవడమే నాకు చాలా ముఖ్యం.'అని విరాట్ చెప్పుకొచ్చాడు.

10 ఏళ్లలో తొలిసారి..
నెల రోజుల విశ్రాంతి తీసుకోవడంపై స్పందిస్తూ..'గడిచిన 10 ఏళ్లలో నేను నెల రోజుల పాటు బ్యాట్ పట్టకుండా ఉండటం ఇదే తొలిసారి. కొద్దిరోజులుగా నా సామర్థ్యానికి తగినట్టుగా ఆడటం లేదని గ్రహించాను. అయితే నేను ప్రతీసారి 'నువ్వు చేయగలవు. పోరాడగలవు. ఆ సామర్థ్యం నీలో ఉంది' అని సర్ది చెప్పుకునేవాడిని. కానీ నా శరీరం మాత్రం నేను ఆలోచించినట్టు లేదు. ఆగిపొమ్మని చెప్పింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నా మనసు కూడా సూచించింది. పైకి నేను మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తిగా కనిపించొచ్చు. కానీ ప్రతీ ఒక్కరికి పరిమితులుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేదంటే పరిణామాలు ప్రమాదకరంగా మారవచ్చు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సెంచరీ లేక వెయ్యి రోజులు..
గత మూడేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ సాధించలేకపోయాడు. దాంతోనే జట్టు సారథ్యాన్ని కోల్పోయాడు. ఆడపా దడపా ఇన్నింగ్స్‌లు ఆడిన అవి విరాట్ కోహ్లీ స్థాయికి సరిపోలేదు. దాంతో ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్నాడు. వెస్టిండీస్ తో పాటు జింబాబ్వే సిరీస్‌ల్లోనూ కోహ్లీ ఆడలేదు.
ఈ సమయంలో కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్రాన్స్‌లో గడిపాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు కోహ్లీ వెళతాడని అంతా ఆశించినా అతడు మాత్రం తన విశ్రాంతిని కొనసాగించాడు. సుదీర్ఘ విరామం అనంతరం పాక్‌తో జరిగే మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్న విరాట్ సత్తా చాటుతాడని అంతా భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications