For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Pakistan మౌకా మౌకా యాడ్‌కు స్వస్తి పలకనున్న స్టార్ స్పోర్ట్స్.. ఆ ఘోర పరాజయంతోనే!

Asia Cup 2022: Star Sports will not be airing ‘Mauka Mauka’ ad for India-Pakistan clash

న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే యావత్ క్రికెట్‌ ప్రపంచానికే పూనకం వచ్చేస్తుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. ఎక్కడ జరిగినా ఉత్కంఠంగానే ఉంటుంది. దాయాదుల పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెడుతుంటుంది. ఒక్కో రన్.. అభిమానికి ఊపిరి పోస్తుంది. ఒక్కో బాల్.. ఆటగాడిని నిలువెల్లా వణికించేస్తుంది. ఒక్కో షాట్.. బౌలర్లనూ చేష్టలుడిగేలా చేస్తుంది. బ్యాట్‌కు, బాల్‌కు మధ్య యుద్దంలా సాగే దాయాదుల పోరంటే అభిమానులకే కాదు ఐసీసీకి, క్రికెట్ బోర్డులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అందుకే ఏ ఐసీసీ టోర్నీలోనైనా ఇరు జట్లు తలపడేలా షెడ్యూల్ రూపొందిస్తోంది.

మౌకా మౌకా యాడ్‌కు గుడ్‌బై..

మౌకా మౌకా యాడ్‌కు గుడ్‌బై..

ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)సైతం ఆసియాకప్ 2022లో ఇరు జట్లు తలపడేలా షెడ్యూల్ రూపొందించింది. లీగ్ దశలో ఆగస్టు 28 దాయదీ దేశాలు తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఇక భారత్-పాక్ హై ఓల్డేజ్ మ్యాచ్‌ను క్యాష్ చేసుకునే అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వినూత్న ప్రమోషన్స్‌తో అభిమానుల ఆసక్తి రేకెత్తించేది. మౌకా మౌకా యాడ్‌తో భారత అభిమానులను అలరించేది. మెగాటోర్నీల్లో పాక్‌పై భారత్‌కు తిరుగులేదని ట్రోల్ చేస్తూ ఈ యాడ్‌ను రూపొందించేది. ఆసియాకప్ పోరు నేపథ్యంలో ఈసారి కూడా మౌకా మౌకా యాడ్ ఉంటుందని భావించిన అభిమానులకు స్టార్ స్పోర్ట్స్ షాకిచ్చింది. ఆ చానెల్ సమాచారం మేరకు ఈసారి మౌకా మౌకా యాడ్‌ను రూపొందించడం లేదని తెలుస్తోంది.

ఎందుకంటే..?

ఎందుకంటే..?

ఇన్నాళ్లు మెగాటోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేదనే ఉద్దేశంతో ఈ యాడ్ రూపొందించారని, కానీ గత టీ20 ప్రపంచకప్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిందని, దాంతో ఈ యాడ్ రూపొందించడంలో అర్థం లేదని భావిస్తున్నట్లు చానెల్ వర్గాలు పేర్కొన్నాయి. 2015 వ‌ర‌ల్డ్‌క‌ప్ టైమ్‌లో ప్రారంభ‌మైన ఈ యాడ్‌.. ప్ర‌తి ఐసీసీ టోర్నీలో ఈ దాయాదులు త‌ల‌ప‌డిన‌ప్పుడ‌ల్లా వ‌స్తూ అభిమానుల‌ను అలరిస్తోంది. గతేడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సంద‌ర్భంగా కూడా మౌకా మౌకా యాడ్‌ అభిమానులను ఆకట్టుకుంది.

'బై వన్‌.. బ్రేక్‌ వన్‌

'బై వన్‌.. బ్రేక్‌ వన్‌

ఆయాడ్‌లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండోపాక్ మ్యాచ్ చూడటానికి ఓ పేద్ద టీవీ కొన‌డానికి త‌న ఫ్రెండ్ షోరూమ్‌కు ప‌టాకులు ప‌ట్టుకొని వ‌స్తాడు ఓ పాక్ అభిమాని. ఈ సంద‌ర్భంగా ఆ టీవీ షోరూమ్ ఓన‌ర్‌.. అత‌న్ని ఆట ప‌ట్టిస్తాడు. అతని చేతిలో రెండు టీవీలు పెడతాడు. రెండు టీవీలు ఎందుకని పాక్‌ అభిమాని అడుగుతాడు. దానికి ఇండియా అభిమాని.. ఏం లేదు.. ఒక టీవీ మ్యాచ్‌ చూడడానికి.. మరొకటి పగులగొట్టడానికని సమాధానమిస్తాడు. అంటే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియాదే విజయం అంటూ పరోక్షంగా చెప్పాడు. దీనికి ఇండియా అభిమాని ''బై వన్‌.. బ్రేక్‌ వన్‌'' ఆఫర్‌ చెప్పడంతో మౌకా.. మౌకా అంటూ యాడ్‌ ముగిసింది.

 27 నుంచి ఆసియా కప్..

27 నుంచి ఆసియా కప్..

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా మంగళవారం ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించాడు. ఈ నెల 28న పాక్‌తో మ్యాచ్‌తో భారత్‌ టైటిల్‌ వేటను ఆరంభించనుంది. 27న టోర్నీ ఆరంభం కానుంది. ఫైనల్‌ సెప్టెంబరు 11న జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌, క్వాలిఫయర్‌ (ఇంకా ఖరారు కాలేదు) గ్రూప్‌ 'ఎ'లో.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ఒక గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4 దశకు అర్హత సాధిస్తాయి. అక్కడ మొదటి రెండు స్థానాలు సాధించిన జట్లు ఫైనల్లోకి ప్రవేశిస్తాయి.

Story first published: Wednesday, August 3, 2022, 18:26 [IST]
Other articles published on Aug 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+