Asia Cup 2022: దేశం కోసమే కాదు.. తన కోసమైనా కోహ్లీ ఆడాలి.. గంగూలీ స్వీట్ వార్నింగ్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆసియాకప్ టోర్నీలో కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఆకాంక్షించిన దాదా.. కనీసం తన కోసమైనా ఆడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాడు. ఈ టోర్నీలో రాణించకుంటే కోహ్లీ కెరీర్ ముగిసే ప్రమాదం ఉందని పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్ పెద్ద విషయమే కాదన్న దాదా.. ఈ మ్యాచ్ ఒత్తిడిని ఎలా అధిగమించాలో భారత ఆటగాళ్లు తెలుసని చెప్పుకొచ్చాడు. ఆసియాకప్ 2022 టోర్నీలో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్‌లు తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన దాదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీకి విషమ పరీక్ష..
'విరాట్ కోహ్లీ కేవలం దేశం కోసం మాత్రమే కాదు.. తన కోసం తాను కూడా పరుగులు చేయాల్సి ఉంది. ఈ సీజన్ కోహ్లీకి గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా.
తను తిరిగి ఫామ్‌లోకి వస్తాడని మాకు నమ్మకం ఉంది. అందరిలాగే మేము కూడా తను శతకం బాదితే చూడాలని కోరుకుంటున్నాం. అందుకు తగ్గట్లుగా కోహ్లీ కష్టపడుతున్నాడు కూడా! అయితే, టీ20ల్లో సెంచరీ చేసేందుకు అవకాశాలు తక్కువ. ఏదేమైనా ఇది కోహ్లీకి గొప్ప సీజన్‌గా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నా'అని దాదా చెప్పుకొచ్చాడు.

పెద్ద మ్యాటరే కాదు..
ఇక భారత్-పాక్ పోరుపై స్పందిస్తూ.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో భారత ఆటగాళ్లకు తెలుసని, పాకిస్థాన్‌తో మ్యాచ్ పెద్ద మ్యాటరే కాదన్నాడు.'భారత్, పాకిస్థాన్ పోరు.. సాధారణ మ్యాచ్ మాత్రమే. రెగ్యులర్‌గా క్రికెట్ ఆడే వారు లేదా నేను ఆడేటప్పుడు పాకిస్థాన్‌ను ఎప్పుడూ ప్రత్యేక మ్యాచ్‌గా తీసుకోలేదు. నిజమే.. నాకౌట్‌లో అదనపు ఒత్తిడి ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగేది నాకౌట్ మ్యాచ్ కాదు కదా

భారత్‌కు ఆ సత్తా ఉంది..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. ఇలా భారత జట్టులో అందరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసు. పాకిస్థాన్‌తో మ్యాచ్ వారికి పెద్ద విషయం కాదు. ఓ సాధారణ మ్యాచులా ఆడితే సరిపోతుంది. భారత్ మంచి జట్టు. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లో భారత్ గెలిచింది. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2022లోనూ భారత్ గెలుస్తుందని నేను అనుకుంటున్నా' అని దాదా పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications