Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2022: అందుకే బ్యాటింగ్ తీసుకున్నా.. అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయలేం: బంగ్లా కెప్టెన్

 Asia Cup 2022: Shakib Al Hasan says We have prepared well

షార్జా: ఆసియాకప్ 2022 టోర్నీలో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్‌ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని బంగ్లా సారథి షకీబ్ అల్ హసన్ తెలిపాడు. ఈ నిర్ణయంతో అఫ్గాన్‌కు కష్టాలు తప్పవని భావిస్తున్నానని చెప్పాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పిన షకీబ్.. బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉందన్నాడు.

ఇక అఫ్గాన్ బౌలర్లకు తగ్గట్లు తమ బ్యాటింగ్ ప్రణాళికలున్నాయని, వారి సమర్థవంతంగా ఎదుర్కొంటామనే నమ్మకం ఉందని చెప్పాడు. తామంతా ఇరుగు పొరుగు దేశాల ఆటగాళ్లమని, ప్రతీ ఒక్కరు ఈ మ్యాచ్‌లు చూస్తారని తెలిపాడు. ఈ టోర్నీలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.

ఇక గత మ్యాచ్‌లో తాము అద్భుతంగా ఆడామని చెప్పిన అఫ్గానిస్థాన్ సారథి మహమ్మద్ నబీ.. అదే జోరును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని, పిచ్ కాస్త నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నామన్నాడు. బంగ్లాను తక్కువ స్కోర్‌కే కట్టడిచేయడానికి ప్రయత్నిస్తామన్నాడు.

శ్రీలంకపై అద్భుత విజయాన్నందుకున్న అఫ్గాన్.. బంగ్లాదేశ్ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇక టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ శుభారంభం చేయాలని భావిస్తోంది.

తుది జట్లు:

బంగ్లాదేశ్: మహమ్మద్ నైమ్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫిఫ్ హోస్సెన్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మోసదెక్ హోస్సెన్, మహమ్మదుల్లా, మెహ్‌దీ హసన్, మహమ్మద్ సైఫుద్దీన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

అఫ్గానిస్థాన్: హజ్రతుల్లా జాజై, రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీమ్ జడ్రాన్, నజిబుల్లా జడ్రాన్, కరీమ్ జనత్, మహమ్మద్ నబీ(కెప్టెన్), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయి, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజాల్షాఖ్ ఫరూఖీ

Story first published: Tuesday, August 30, 2022, 19:53 [IST]
Other articles published on Aug 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+