For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2022: కొంపముంచిన సన్‌రైజర్స్ బౌలర్.. పాక్ ఫైనల్‌కి.. ఇండియా ఇంటికి..!

Naseem Shah Takes Pakistan Into Final

దుబాయ్: ఆసియాకప్ 2022లో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల పోరాటం ముగిసింది. అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన డూఆర్‌డై మ్యాచ్‌లో పాకిస్థాన్ వికెట్ తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నసీమ్ షా రెండు సూపర్ సిక్స్‌లతో విజయాన్నందించాడు. ఇక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఫజల్లక్ ఫరూఖీ రెండు ఫుల్‌టాస్‌లతో జట్టు కొంపముంచాడు. ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన నసీమ్ షా సంచలన విజయాన్నందించాడు. ఈ ఓటమితో అఫ్గానిస్థాన్, భారత్ జట్లు అధికారికంగా టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాయి.

జడ్రాన్ మినహా...
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జడ్రాన్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35), హజ్రతుల్లా జాజై(17 బంతుల్లో 4 ఫోర్లతో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్‌నైన్, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు.

నసీమ్ షా హీరో..
అనంతర లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. ఇఫ్తికర్ అహ్మద్(33 బంతుల్లో 2 ఫోర్లతో 30), షాదాబ్ ఖాన్(26 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. నసీమ్ షా(4 బంతుల్లో 2 సిక్స్‌లతో 14 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్లాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్, మూడేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

చెలరేగిన అఫ్గాన్ బౌలర్లు..
130 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఫజల్లక్ ఫరూఖీ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ సెకండ్‌బాల్‌కే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ కొద్దిసేపటికే ఫకార్ జమాన్ రనౌటయ్యాడు. దాంతో పాక్ 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మహమ్మద్ రిజ్వాన్(20) పోరాడే ప్రయత్నం చేసినా రషీద్ ఖాన్ దెబ్బ తీసాడు. ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. రిజ్వాన్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజలోకి వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. నాలుగో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇఫ్తికర్‌ను ఔట్ చేసి ఫరీద్ అహ్మద్ ఈ జోడీని విడదీయగా.. షాదాబ్ ఖాన్‌ను రషీద్ పెవిలియన్ చేర్చాడు.

గెలిచే మ్యాచ్‌లో..
క్రీజులోకి వచ్చిరావడంతో సిక్సర్ బాది అసిఫ్ అలీ(7) జోరు కనబర్చాడు. అయితే మహమ్మద్ నవాజ్‌(4)ను ఫరూఖీ 18వ ఓవర్‌లో ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్ చివరి బంతికి కుష్దిల్ షా(1)ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. పాక్ విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. ఫరీద్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో హ్యారీస్ రౌఫ్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో అఫ్గాన్ శిభిరంలో ఆశలు చిగురించాయి. అయితే సిక్సర్ బాది జోరు కనబర్చిన అసిఫ్ అలీ(16) మరుసటి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా.. ఆఖరి ఓవర్‌లో నసీమ్ షా అనూహ్యంగా రెండు సిక్స్‌లు బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. దాంతో పాక్ ఫైనల్ చేరగా.. అఫ్గాన్, టీమిండియా ఇంటిదారి పట్టింది.

Story first published: Wednesday, September 7, 2022, 23:20 [IST]
Other articles published on Sep 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+