Asia Cup 2022: నలుగురు స్పిన్నర్లు ఎందుకయ్యా? ఆ సీనియర్ పేసర్‌ను తీసుకోరా?.. మాజీ కెప్టెన్ ఫైర్!

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022 టీ20 టోర్నీకి టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని ఎంపికచేయకపోవడాన్ని మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో షమీని ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. అంతేకుండా జట్టులోకి నలుగురు స్పిన్నర్లను తీసుకోవడాన్ని తప్పుబట్టాడు. నాలుగో స్పిన్నర్‌కు బదులు సీనియర్ పేసర్ అయిన మహమ్మద్ షమీని తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ఒక్కటి మినహా మిగతా టీమ్ బాగుందని, టీ20 ప్రపంచకప్‌కు ఇది బ్లూ ప్రింట్ అని పేర్కొన్నాడు. చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

బుమ్రా, హర్షల్ ఔట్..
ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఆటకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ జట్టులోకి రాగా.. గాయాల కారణంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ టీమ్‌కు దూరమయ్యారు. ఈ ఇద్దరి స్థానాలను అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌లతో భర్తీ చేశారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్‌లను సెలెక్టర్లు స్టాండ్‌బైగా తీసుకున్నారు. విండీస్ పర్యటనకు ఎంపికైన ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌పై వేటు పడింది. టీమ్ ఎంపికపై స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన శ్రీకాంత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

షమీని తీసుకోవాల్సింది..
'నేను అయితే మహమ్మద్ షమీని ఎంపిక చేసేవాడిని. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్నా ఇదే పని చేసేవాడిని. రవి బిష్ణోయ్ స్థానంలో మహ్మద్ షమీకి అవకాశం ఇచ్చేవాడిని. నిజానికి అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉండాల్సింది. అయితే, అశ్విన్- అక్షర్ పటేల్‌లో ఒక్కరే అంటే మాత్రం సీనియర్‌కే ఓటు వేసేవాడిని. మొత్తానికి జట్టు అయితే బాగానే ఉంది. ఇది టీ20 ప్రపంచకప్‌కు బ్లూ ప్రింట్ వంటిది. అక్షర్ పటేల్‌కు తుది జట్టులో అవకాశం రాకపోవడం నిరాశకు గురి చేసింది. దీపక్ హుడా ఎంపిక సరైనదే. బ్యాట్, బంతితో రాణించగలడు.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

టీ20లకు సెట్ కాడనే..
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో మహ్మద్ షమీ.. ఆరు వికెట్లు తీశాడు. ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన షమీ.. అరంగేట్ర సీజన్‌లోనే జట్టు విజేతగా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు తరఫున అతడికి పొట్టి ఫార్మాట్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్ షమీకి సూట్ కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ఈవెంట్‌కు షమీ ఎంపిక కాకపోవడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications