Asia Cup 2022: భారత్ X పాక్ మ్యాచ్.. స్టార్ స్పోర్ట్స్‌కు పైసలే పైసల్! 10 సెకన్ల యాడ్‌కు ఎంతంటే..?

హైదరాబాద్: యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న భారత్ X పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. సరిగ్గా మరో వారం రోజులకు( ఆగస్టు 28న) దాయాదీ దేశాల మధ్య మైదానం వేదికగా భీకర యుద్దం జరగనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి రెండింతల ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా భావిస్తుంటే.. అదే జోరును కొనసాగించాలని బాబర్ ఆజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు సిద్దమవుతోంది. మొత్తానికి ఈ హైఓల్టేజ్ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందివ్వనుండగా.. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు కనక వర్షం కురిపియనుంది.

10 సెకన్లకు రూ.18 లక్షలు
ఇప్పటికే ఈ మ్యాచ్ కమర్షియల్ యాడ్స్ స్లాట్స్‌ను అమ్ముకున్న స్టార్ స్పోర్ట్స్.. 10 సెకన్ల యాడ్‌కు భారీ మొత్తంలో వసూలు చేస్తోంది. అయితే గతేడాది టీ20 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్ కంటే తక్కవ ధరకే యాడ్ స్పాట్స్‌ను స్టార్ స్పోర్ట్స్ అమ్ముకుందని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ X పాక్ మ్యాచ్‌కు సంబంధించిన 10 సెకన్ల యాడ్ స్పాట్స్‌ను స్టార్ స్పోర్ట్స్ రూ.22-25 లక్షలకు అమ్ముకోగా.. ఈ సారి మాత్రం రూ.16-18 లక్షలకే అమ్ముకుంది.

చాలా గొప్ప విషయం..
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియాకప్ మ్యాచ్‌కు ఈ ధర రావడం చాలా గొప్ప విషయమని ఓ అడ్వర్టైజింగ్ ఏజన్సీకి సంబంధించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. 'ప్రపంచకప్‌తో ఆసియాకప్‌ను పోల్చడం ఏ మాత్రం సరికాదు. ప్రపంచకప్‌కు ఉండే ఆదరణ, హైప్ ఆసియాకప్ కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా ప్రస్తుతం టాప్ అడ్వర్టైజింగ్ కేటగిరీలు అన్నీ డల్‌గా ఉన్నాయి. విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ కామర్స్ దిగ్గజాలు నిశబ్దంగా ఉన్నాయి. డబ్బులు ఖర్చు చేయడానికి నిరాసక్తత చూపిస్తున్నాయి.'అని తెలిపాడు.

యాడ్ స్పాట్స్ భర్తీ...
అయితే ఇప్పటికే స్టార్ స్పోర్ట్స్ అడ్వర్టైజర్స్‌ను రాబట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డ్రీమ్ 11, రాజ్‌శ్రీ పాన్ మసాల, సామ్‌సంగ్ గ్యాలక్సీ, థంప్స్‌అప్ వంటి కంపెనీలు స్టార్ స్పోర్ట్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రజెంటింగ్ పార్ట్‌నర్స్‌గా డ్రీమ్ 11, రాజ్‌శ్రీ పాన్ మసాల, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఉండగా.. అసోసియేట్ స్పాన్సర్స్‌గా.. ఎల్‌ఐసీ, థంప్స్‌అప్‌లు వ్యవహరించనున్నాయి.

మూడో సారి జరిగితే బోనస్..
'ఆసియాకప్ టోర్నీపై ఆయా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ముఖ్యంగా భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన యాడ్ స్పాట్స్ కోసం ఆసక్తికనబర్చాయి. కలిసొచ్చే విషయం ఏంటంటే టోర్నీలో భారత్-పాక్ జట్లు రెండు సార్లు కచ్చితంగా తలపడనున్నాయి. మూడోసారి తలపడితే అదృష్టమే. ఈ మ్యాచ్‌కు సంబంధించి 90 శాతం ఇన్వెంటరీ అమ్మేసాం'అని స్టార్ స్పోర్ట్స్ సేల్స్ టీమ్ మొంబర్ ఒకరు పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications