Asia Cup 2022: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ ఆదివారం మళ్లీ భారత్ X పాక్ మ్యాచ్!

దుబాయ్: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆసియా కప్ 2022లో భాగంగా మరోసారి భారత్ X పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఆదివారమే(సెప్టెంబర్ 4) ఈ హై ఓల్టేజ్ సమరం జరగనుంది. అయితే ఎలాంటి అద్భుతాలు జరగకుంటేనే ఈ మ్యాచ్ జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే.. టోర్నీ షెడ్యూల్ ప్రకారం గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్, హాంగ్‌కాంగ్ జట్లు ప్రత్యర్ధి జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్ 4న సూపర్ 4లో తలపడతాయి.

హాంకాంగ్ ఓడితే...
గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా ఇప్పటికే పాకిస్థాన్‌ను ఓడించి టేబుల్ టాపర్ (ఏ-1) బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్ తదుపరి మ్యాచ్‌ల్లో రేపు( ఆగస్ట్ 31న) టీమిండియా, హాంకాంగ్ జట్లు.. ఆ తర్వాత సెప్టెంబర్ 2న పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. పై రెండు మ్యాచ్‌ల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. పసికూన హాంగ్‌కాంగ్ గెలిచే అవకాశం లేదు. ఈ లెక్కన గ్రూప్-ఏలో తొలి స్థానంలో భారత్.. రెండో స్థానాన్ని పాకిస్థాన్ కైవసం చేసుకోనుంది. ఇదే జరిగితే సెప్టెంబర్ 4న మరోసారి భారత్ X పాక్ మ్యాచ్ చూడవచ్చు.

ఫైనల్లో కూడా..
అంతా సవ్యంగా జరిగితే సూపర్-4 దశలోనే కాకుండా టోర్నీ ఫైనల్లోనూ ఇరు జట్ల తుపాకులు తూటాలు లేని యుద్దాన్ని చూడవచ్చు. అది ఎలా అంటే.. సూపర్-4కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని జట్టుతో పాటు ఇతర గ్రూప్‌లోని (గ్రూప్-బి) తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లతో (బి1, బి2) ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇక సూపర్-4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 11న (ఆదివారం) ఫైనల్లో తలపడతాయి. ఆయా జట్ల ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే.. సూపర్-4లో భారత్, పాక్ జట్లకే తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అభిమానులకు పండుగే పండుగ..
ఇదే జరిగితే.. భారత్, పాక్‌లు ముచ్చటగా మూడోసారి ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే రెండు ఆదివారాలు (సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 11) భారత్, పాక్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. ఇదే జరిగితే టీ20 ప్రపంచకప్ ముందు భారత్‌కు అసలు సిసలు ప్రాక్టీస్ లభించనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో గనుక భారత్ గెలిస్తే ఆటగాళ్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించనుంది. మరి రోహిత్ సేన ఏం చేస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications