Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కింగ్ ఈజ్ బ్యాక్.. పాకిస్థాన్‌‌కు దబిడి దిబిడే! 100వ మ్యాచ్‌లో చుక్కలే.. కోహ్లీ ఫ్యాన్స్ ధీమా!

Asia Cup 2022: Fans excited to see Virat Kohli in action in his 100th T20I against Pakistan

హైదరాబాద్: ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఆటకు దూరంగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ నెల 27 నుంచి జరిగే ఆసియా కప్ టీ20 టోర్నీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ టోర్నీ కోసం సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. రోహిత్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో కోహ్లీతో పాటు గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. గాయాల కారణంగా స్టార్ పేసర్ బుమ్రా, హర్షల్ పటేల్ టీమ్‌కు దూరమయ్యారు.

శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌లను సెలెక్టర్లు స్టాండ్‌బైగా తీసుకున్నారు. ఈ టోర్నీ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఆగస్టు 28న జరిగే తొలి మ్యాచ్‌తో కోహ్లీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే కోహ్లీకి ఇది కెరీర్‌లో 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఈ నేపథ్యంలోనే అతను సత్తా చాటుతాడని కోహ్లీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషపడుతున్నారు.

పేలవ ఫామ్‌తో..

ఐపీఎల్ 2022 సీజన్ నుంచి విరాట్ కోహ్లీ నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్‌సీబీ తరఫున ఈ సీజన్‌లో విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. 2010 తర్వాత అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చాడు. రెండు హాఫ్ సెంచరీలు బాదిన విరాట్.. 22.7 సగటును మాత్రమే నమోదు చేశాడు. అనంతరం సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్.. ఇంగ్లండ్ పర్యటనలో బరిలోకి దిగాడు. అయితే అక్కడ కూడా విరాట్ దారుణంగా విఫలమయ్యాడు.

సుదీర్ఘ విరామంతో..

ఒక టెస్ట్, రెండేసి టీ20లు, వన్డేలతో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 76(11, 20, 1, 11, 16, 17) రన్స్ మాత్రమే చేశాడు. ఈ వైఫల్యంతో బ్రేక్ తీసుకున్న విరాట్.. యూకేలో ఫ్యామిలీతో గడిపాడు. ఈ క్రమంలోనే విండీస్, జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇది విరాట్‌కు ప్రత్యేకమైన మ్యాచ్ కావడంతో అభిమానులంతా అతనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

పాక్‌కు దబిడి దిబిడే..

పాక్‌కు దబిడి దిబిడే..

ఈ మ్యాచ్‌లో విరాట్ చెలరేగుతాడని, పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తాడని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలోని ప్రతీ ఒక్కరు విరాట్ కోహ్లీ కోసం వేచి చూస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. వెన్నుపోటు కంటే కోహ్లీ కమ్ బ్యాక్ బలంగా ఉంటుందని, దుమ్మురేపుతాడని ట్వీట్స్ చేస్తున్నారు. ఒత్తిడిలో చెలరేగే విరాట్ పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టు..

ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవిబిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్.

Story first published: Tuesday, August 9, 2022, 10:05 [IST]
Other articles published on Aug 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+