నెలరోజుల బ్రేక్‌తో..
అయితే ఈ టోర్నీకి ముందు విరాట్ కోహ్లీ 6 వారాల విశ్రాంతి తీసుకున్నాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో ఏ రోజు కూడా తాను నెలరోజుల పాటు బ్యాట్ పట్టకుండా ఉండలేదని, ఈ విశ్రాంతి తనకు చాలా హెల్ప్ చేసిందన్నాడు. ఫామ్‌లోకి రావడానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌తో ఫస్ట్ మ్యాచ్‌లో కీలక సమయంలో 35 పరుగులతో టచ్‌లోకి వచ్చిన విరాట్.. హాంగ్‌కాంగ్‌పై (59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పాకిస్థాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌లో 60 పరుగులతో జట్టుకు అండగా నిలిచాడు. కీలక శ్రీలంకతో మాత్రం డకౌటయ్యాడు. అఫ్గాన్ మళ్లీ అజేయ సెంచరీ బాది ఆసియాకప్ 2022లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఆ క్యాచ్ పట్టుంటే..
అయితే విరాట్ ఫామ్‌లోకి రావడానికి ఇదంతా నాణేనాకి ఒక వైపు అయితే.. మరోవైపు ఫకార్ జమాన్ లైఫ్ ఇవ్వడం. పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు పాక్ యువ పేసర్ నసీమ్ షా తొలి ఓవర్‌లోనే షాకిచ్చాడు. రెండో బంతికే రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అతను.. మూడో బంతికి విరాట్‌ను పెవిలియన్ చేర్చే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. సుమారు నెలరోజుల విశ్రాంతి తర్వాత విరాట్ ఎదుర్కొన్న ఈ బంతి అతని బ్యాట్ తాకి మూడో స్లిప్ వైపు దూసుకెళ్లింది. ఫకార్ అప్రమత్తంగా లేక క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఈ లైఫ్‌తో బచాయించిన విరాట్.. నిదానంగా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

కోహ్లీ కెరీర్ ముగిసిపోయేది..
మ్యాచ్ మ్యాచ్‌కు పరుగులు చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని మూడేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న సెంచరీని కూడా అందుకున్నాడు. అయితే ఫకార్ జమాన్ గనుక ఆ క్యాచ్ పట్టుంటే విరాట్ అస్సలు ఫామ్‌లోకే వచ్చేవాడు కాదు. నెల రోజుల విశ్రాంతి తర్వాత ఆడిన ఫస్ట్ బాల్‌కే ఔటైతే అతని మానసికంగా మరింత బలహీన పడేవాడు. పైగా ఆ మ్యాచ్‌లో విరాట్ ఔట్ అయ్యుంటే ఫలితం పాక్‌కు అనుకూలంగా ఉండేది. అదే జరిగితే విరాట్‌పై తీవ్ర విమర్శలు వచ్చేవి. అవి అతన్ని మరింత ఒత్తిడిలోనికి నెట్టేవి. ఏది ఏమైనా ఫకార్ జమాన్ క్యాచ్ నేలపాలు చేసి పుణ్యం కట్టుకున్నాడు. లేకుంటే విరాట్ కెరీరే ప్రమాదంలో పడేది.


Click it and Unblock the Notifications












