IND vs PAK: ఆ పాక్ పేసర్ ఏం పోటుగాడు కాదు.. అతనికి భయపడాల్సిన అవసరం లేదు! రోహిత్ సేనకు కనేరియా అడ్వైజ్!

కరాచీ: ఆసియా కప్ 2022 టీ20 టోర్నీకి టైమ్ ఆసన్నమైంది. మరో రెండు వారాల్లో ఈ టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఇక దాయాదీ దేశాలైన భారత్, పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న ఆడనున్నాయి. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన చర్చలు, విశ్లేషణలు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతున్నాయి. పాక్‌తో తలపడే భారత జట్టుకు మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానేష్ కనేరియా సైతం రోహిత్ సేనకు విలువైన సలహా ఇచ్చాడు.

పోటుగాడేం కాదు..
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిదిని చూసి ఏ మాత్రం భయపడవద్దని, అతనేం పోటుగాడు కాదన్నాడు. ఓపికగా ఆడితే సరిపోతుందని, బంతిని స్వింగ్ చేస్తున్నాడా? లేదా? అనేది గమనించాలని భారత బ్యాటర్లకు సూచించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన కనేరియా.. టీమిండియా టాపార్డర్ కాస్త జాగ్రత్తగా ఆడితే అఫ్రిదిని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాడు. 'షాహిన్ అఫ్రిదిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎలైట్ బ్యాటర్ల లిస్ట్ లో ఉన్నారు. వాళ్లు కాస్త జాగ్రత్తగా ఆడితే సరిపోతుంది. బంతిని స్వింగ్ చేస్తున్నాడా..? లేదా..? అనేది గమనించాలి.

సూర్య ఎలా ఆడుతాడో..
బాడీతో, కాళ్లతో కాకుండా బ్యాట్‌తో బంతులను ధీటుగా ఎదుర్కోవాలి. ఈ మ్యాచ్‌లో అఫ్రిది బౌలింగ్‌ను సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడతాడో చూడాలి. స్క్వేర్ లెగ్ దిశగా అతడు ఆడే ఫ్లిక్ స్ట్రోక్స్‌ను ఎలా కొడుతాడో'అని పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్ దినేశ్ కార్తీక్‌కు కీలకం కానున్నదని కనేరియా అన్నాడు. ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అతను.. ముందు ఆసియా కప్ ను భారత్‌కు అందిస్తే సెలక్టర్లకు మరో ఆప్షన్ లేకుండా పోతుందని చెప్పాడు. సెలక్టర్లతో పాటు క్రికెట్ అభిమానులు అతని ఫామ్, ఫిట్‌నెస్‌ను చూస్తున్నారని, అతడు ఆసియా కప్ లో రాణించాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీకి చాలా కీలకం..
ఆసియాకప్ విరాట్ కోహ్లీకి చాలా కీలకమని, అతని భవితవ్యం ఈ టోర్నీలో రాణించడంపైనే ఆధారపడి ఉందని కనేరియా అభిప్రాయపడ్డాడు. 'ఈ ఆసియా కప్ విరాట్ కోహ్లీ కెరీర్‌కు చాలా కీలకం. సుదీర్ఘ కాలం తన కెరీర్‌ను కొనసాగించాలంటే ఈ టోర్నీలో రాణించాల్సిందే. కోహ్లీ పరుగులు చేయకుండా విఫలమైతే జట్టుకు భారమైతాడని చాలా మంది మాజీ క్రికెటర్లు తెలిపారు. కాబట్టి అతను ఈ టోర్నీ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ స్థానం కోసం అయ్యర్, శాంసన్, గిల్ కాచుకొని కూర్చున్నారు'అని కనేరియా తెలిపాడు.

భారత్ పతనాన్ని..
గతేడాది టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి బాటలు వేసిన వారిలో ముఖ్యుడు షాహీన్ షా అఫ్రిది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోవడానికి కారణమయ్యాడు . ఆ మ్యాచ్ లో ఈ యువ పేసర్ 4 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తో పాటు విరాట్ కోహ్లీల వికెట్లు అఫ్రిదికే దక్కాయి. రాహుల్ ను ఔట్ చేసిన బంతి అయితే హైలైట్. అయితే ఆ మ్యాచ్ తర్వాత ఈ రెండు జట్లు మళ్లీ ఆసియా కప్ వేదికగా తలపడబోతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications