Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2022: పాకిస్థాన్‌పై భారత్‌దే విజయం.. ఎందుకంటే..?

Asia Cup 2022: Danish Kaneria says India Has Chances To Beat Pakistan Because Of Their Bowling Strength

కరాచీ: ఆసియాకప్‌ 2022 టీ20 టోర్నీలో పాకిస్థాన్‌పై భారత జట్టే విజయం సాధిస్తుందని మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు. పాక్ కంటే భారత బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉందని చెప్పాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడినా.. ఈ సారి మాత్రం 60 శాతం ఆ జట్టుకే విజయవకాశాలున్నాయని జోస్యం చెప్పాడు. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ మొదలు కానుండగా... ఆ మరుసటి రోజే భారత్‌-పాక్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా దాయాది జట్టుపై విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

మరోవైపు పాక్‌ కూడా మరోసారి భారత్‌పై పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో దాయాదుల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు.. ఏ ఆటగాడు కీలకంగా మారుతారనే విషయాలపై పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా విశ్లేషించాడు. 'ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నా. చాలా రోజుల తర్వాత గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. అలానే బ్యాక్‌ పెయిన్‌తో ఇబ్బంది పడి కోలుకున్న రోహిత్ శర్మ ఆసియా కప్‌లో ఎలా ఆడతాడనేది కీలకం. ఇక పాకిస్థాన్‌ జట్టుకు వస్తే.. నసీమ్‌ షా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.

షాహీన్‌ షా అఫ్రిదికి ఫిట్‌నెస్‌ సమస్య ఉంది. ఇలా ఇరు జట్ల నుంచి కొందరు గాయాల జాబితాలో ఉన్నారు. అయితే పాకిస్థాన్‌ కంటే భారత్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా టీ20లను టీమిండియా ఆడింది. అందుకే ఈ మ్యాచ్‌లో భారత్‌కు 60 శాతం.. పాకిస్థాన్‌కు 40 శాతం విజయవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో అత్యుత్తమ బౌలింగ్‌ దళం ఉంది. ప్రపంచ స్థాయి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, చాహల్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాతోపాటు ఫాస్ట్‌ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్ ఉన్నారు. వీరంతా అద్భుతాలు చేయగలరు. అందుకే పాక్ కంటే భారత్‌కే అడ్వాంటేజ్ ఉందని చెబుతున్నా. అయితే షాహీన్‌ షా కోలుకోకపోతే పాకిస్థాన్‌కు నమ్మదగ్గ బౌలర్‌ ఎవరు ఉన్నారనేది ప్రశ్నార్థకం' అని కనేరియా వివరించాడు.

Story first published: Friday, August 19, 2022, 15:55 [IST]
Other articles published on Aug 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+