For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Pakistan: ఓడితే కొంపలు మునిగేదేం లేదు.. ఆటను ఆటలా ఎంజాయ్ చేయండి!

Asia Cup 2022: Cricket lovers request to fans enjoy India vs Pakistan clash

హైదరాబాద్: భారత్ X పాకిస్థాన్ మహాసంగ్రామం.. తుపాకులు, తూటాలు లేని యుద్దం.. ఇరు దేశాల మధ్య మైదానంలో జరిగే ప్రత్యక్ష వార్.. అనే హడావుడి అవసరం లేదు. స్వచ్చమైన క్రికెట్ పరి భాషలో ఇది ఓ సాధారణ లీగ్ మ్యాచ్ మాత్రమే. ఇరు దేశాల సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేకపోవడం.. ఇలా అరుదుగా తలపడుతుండటమే భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌పై అమితాసక్తి ఏర్పడుతోంది. అయితే భావోద్వేగాలతో ఈ మ్యాచ్‌ను చూడాల్సిన పనిలేదని క్రికెట్ లవర్స్ అంటున్నారు.

ఓడినా నష్టమేం లేదు..

ఓడినా నష్టమేం లేదు..

ఆటను ఆటలా ఆస్వాదించాలని కోరుతున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా కొంపలు మునిగేదేం లేదని, ఆసియాకప్ టోర్నీ ఫార్మాట్ అలా ఉందని చెబుతున్నారు. పాక్‌తో ఓడినంత మాత్రానా భారత్ తట్టా బుట్టా సర్దుకోని ఇంటికి రాదని, మరో మ్యాచ్‌లో హాంకాంగ్‌తో గెలిస్తే సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అవుతుందని చెబుతున్నారు. అక్కడ మరోసారి పాక్‌తో తలపడే అవకాశం ఉంటుందని, క్రికెట్ మ్యాచ్‌లను ఇరు దేశాల మధ్య యుద్దంలా భావించొద్దని సూచిస్తున్నారు.

భావోద్వేగాలు వద్దు..

భావోద్వేగాలు వద్దు..

ఈ హైప్‌ను కొన్ని సంస్థలు, బ్రాడ్ కాస్ట్ చానెళ్లు, క్రికెట్ బోర్డులు సొమ్ము చేసుకోవడమే తప్పా.. ఈ మ్యాచ్ ఫలితంతో ఇరు దేశాలకు ఒరిగేదేం లేదని, ఆటను ఆటలానే చూసి ఎంజాయ్ చేయాలంటున్నారు. ఇరు దేశాల ఆటగాళ్లు కూడా ఇదే దోరణితో ఉన్నారు. మీరు భావోద్వేగానికి గురై మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టడం ఏ మాత్రం సమంజసం కాదని, క్రికెట్ లవర్స్‌గా మ్యాచ్‌ను ఆస్వాదిద్దామని తమ చేతలతో పిలుపునిస్తున్నారు.

స్నేహ పూర్వకంగా ఆటగాళ్లు..

స్నేహ పూర్వకంగా ఆటగాళ్లు..

గత కొంత కాలంగా చూస్తే ఆటగాళ్లు మధ్య స్నేహాలు, ప్రత్యేక పలకరింతలు, పరస్పర అభినందనలు, అవతలి జట్టు అభిమానులతో లెక్క లేనన్ని సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లకు సిద్ధమైపోతూ ఈ పోరు తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అభిమానులంతా హాయిగా మ్యాచ్‌ను ఆస్వాదించాలని క్రికెట్ లవర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక భారత్ X పాక్ మ్యాచ్ హైప్‌ను బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో సహా టోర్నీ నిర్వాహకులు క్యాష్ చేసుకున్నారు.

సొమ్ము చేసుకుంటున్న సంస్థలు..

సొమ్ము చేసుకుంటున్న సంస్థలు..

స్టార్ స్పోర్ట్స్ తమ యాడ్స్ రేట్లను పెంచగా.. నిర్వాహకులు టికెట్ల రేట్లను పెంచేసారు.స్టేడియంలో అన్ని టికెట్లు 10 రోజుల ముందే అమ్ముడుపోయాయి. టోర్నీలో ఇతర మ్యాచ్‌లకు 400 దిర్హమ్‌లు (సుమారు రూ.8,700)కు అమ్ముడుపోయే టికెట్‌ ఈ మ్యాచ్‌ కోసం 6000 దిర్హమ్‌లు (సుమారు 1 లక్షా 30 వేలు) పలికింది. నాలుగు గంటల వినోదం అంటూ కొన్ని కార్పొరేట్‌ సంస్థలు భారత్‌ నుంచి దుబాయ్‌కు ప్రత్యేక విమానాల్లో ట్రిప్‌లు కూడా ఏర్పాటు చేశాయి.

Story first published: Sunday, August 28, 2022, 17:20 [IST]
Other articles published on Aug 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+