Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2022: భారత్‌తో మ్యాచ్.. పాకిస్థాన్‌కు గట్టి షాక్! గాయంతో స్టార్ పేసర్ దూరం!

Asia Cup 2022: Big blow of Pakistan as pacer Shahnawaz Dahani ruled out of Super 4 match against India

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ షానవాజ్ దహాని పక్కటెముకల గాయంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. హంగ్ కాంగ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో షానవాజ్ దహని గాయపడ్డాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.

పక్కటెముకల గాయంతో..

పక్కటెముకల గాయంతో..

'భారత్‌తో ఆదివారం జరగనున్న ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌కు షానవాజ్ దహాని దూరయ్యాడు. అతను పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా దహాని గాయపడ్డాడు. ప్రస్తుతం పాకిస్థాన్ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుంది. గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కాన్ తీయించింది. ఆ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత అతను టోర్నీలో కొనసాగుతాడా లేక మొత్తం దూరమవుతాడా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. 'అని పీసీబీ పేర్కొంది.

దెబ్బ మీద దెబ్బ..

షానవాజ్ దహాని దూరమవడం పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. టోర్నీ ప్రారంభానికి ముందే షాహిన్ షా అఫ్రిది, మహమ్మద్ వసీం జూనియర్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి దహాని చేరడంతో ఆ జట్టు బౌలింగ్ లైనప్‌పై ప్రభావం చూపనుంది. భారత్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపని దహాని.. బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. చివర్లో ధాటిగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇక హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో షానవాజ్ దహాని అద్భుత బౌలింగ్‌తో కీలక వికెట్ తీసాడు. ఇక షానవాజ్ గైర్హాజరీలో మహమ్మద్ హస్నైన్, హసన్ అలీలో ఒకరు తుది జట్టులోకి రానున్నారు.

జడేజా సైతం..

జడేజా సైతం..

మరోవైపు భారత జట్టు కూడా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సేవలను కోల్పోయిన విషయం తెలిసిందే. మొకాలి గాయంతో జడేజా టోర్నీ మొత్తానికి దూరమవ్వగా.. అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. లీగ్ మ్యాచ్‌ల్లో రెండింటికి రెండు గెలిచిన టీమిండియా.. గ్రూప్-ఏ టాపర్‌గా సూపర్ 4 చేరింది. మరోవైపు భారత్ చేతిలో ఓడి.. హాంగ్ కాంగ్‌పై భారీ విజయాన్నందుకున్న పాక్ గ్రూప్ ఏ రన్నరప్‌గా ముందడుగు వేసింది. సూపర్ 4 పోరులో ఆదివారం భారత్‌‌తో అమితుమీ తేల్చుకోనుంది. దాంతో మరోసారి హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. తొలి మ్యాచ్ తరహాలోనే పాక్‌ను మళ్లీ ఓడించి తమ జోరు కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తుండగా.. గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది.

Story first published: Saturday, September 3, 2022, 19:20 [IST]
Other articles published on Sep 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+