
దీపక్ చాహర్‌కు గాయమా?
గాయంతో సుమారు 6 నెలల పాటు ఆటకు దూరమైన దీపక్ చాహర్ ఇటీవలే.. జింబాబ్వే పర్యటనతో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో తనదైన బౌలింగ్‌తో సత్తా చాటాడు. అయితే ఆ తర్వాత రెండో వన్డేలో దీపక్ చాహార్‌కి తుదిజట్టులో చోటు దక్కలేదు. ఆరు నెలల తర్వాత ఒక్క మ్యాచ్ ఆడిన దీపక్ చాహార్‌కి, రెండో వన్డేలో రెస్ట్ ఇవ్వడంపై పెద్ద చర్చే జరిగింది.
అయితే మూడో వన్డేలో దీపక్ చాహార్‌ని తిరిగి జట్టులోకి తీసుకొచ్చిన మేనేజ్‌మెంట్, అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ వంటి సీనియర్లు గాయపడి, ఆసియా కప్ 2022 టోర్నీకి దూరం కావడంతో దీపక్ చాహార్‌కి తుది 15 మంది జట్టులో చోటు ఇస్తే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.

ఫిట్‌గా ఉన్నాడు..
అయితే కుల్దీప్ సేన్‌కు టీమిండియా పిలుపు అందిందనే వార్తలు బయటకి రావడంతో చాహర్ మరోసారి గాయపడ్డాడని అంతా అనుకున్నారు. చాహర్ స్థానంలోనే కుల్దీప్ సేన్ స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికయ్యారని అంతా భావించారు. కానీ ఈ వార్తలపై ఓ బీసీసీఐ అధికారి స్పష్టతనిచ్చాడు. కుల్దీప్ సేన్ కేవలం నెట్‌బౌలర్‌గా మాత్రమే సేవలందించనున్నాడని తెలిపాడు. 'దీపక్ చాహర్‌కు గాయమైనట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. అతను ఫిట్‌గా ఉన్నాడు. జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిన్న, ఈరోజు కూడా ప్రాక్టీస్ చేశాడు. కుల్దీప్ సేన్ నెట్‌బౌలర్‌గా జట్టులో చేరాడు. అతను అద్భుతమైన పేసర్'అంటూ సదరు అధికారి పేర్కొన్నాడు.

సంచలన ప్రదర్శనతో..
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన కుల్దీప్ సేన్ దుమ్మురేపాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 15 పరుగులను కట్టడి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 7 మ్యాచ్‌ల్లో 9.42 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీసాడు. ఆసియాకప్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో భారత తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.


Click it and Unblock the Notifications












