Asia Cup 2022: అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు బాబర్.. ఇద్దరూ ఒకే తప్పిదంతో ఓటమిపాలయ్యారు!

దుబాయ్: ఆసియాక్‌పలో భారత జట్టు బోణీ చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన తమ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్టయ్యింది. హార్దిక్ పాండ్యా (3/25; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33 నాటౌట్) ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), కోహ్లీ (34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) సహకారం అందించారు.
లక్ష్య ఛేదన కేవలం 148 పరుగులే అయినా మ్యాచ్‌లో కావాల్సినంత ఉద్వేగం.. నరాలు తెగే ఉత్కంఠకు కొదువ లేకుండా పోయింది. అయితే పాక్ బౌలర్ల పట్టు వీడని పోరాటం ముందు భారత బ్యాటర్ల తెగింపుదే పైచేయి అయ్యింది. చివరి ఓవర్ వరకు ఇరు జట్లకు అవకాశం కనిపించిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్‌కు ఆశించిన విధంగానే మజాను అందించింది.

ఐదుగురు బౌలర్లతోనే..
2014 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన తప్పిదాన్నే బాబర్ ఆజామ్ ఈ మ్యాచ్‌లో చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగి ఘోరతప్పిదం చేశాడు. దాంతో ఆఖరి ఓవర్ వేసేందుకు పేస్ బౌలర్ అందుబాటులో లేకుండా చేసుకొని ఘోర పరాజయం చవిచూసాడు. మహమ్మద్ నవాజ్‌తో ఆఖరి ఓవర్‌ను వేయించాడు. అయితే భారత బ్యాటర్లను ఒత్తిడికి గురిచేయాలనే పేసర్లతో ముందుగా బౌలింగ్ చేయించానని మ్యాచ్ అనంతరం తెలిపాడు. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది.

2014లో కోహ్లీ సైతం..
2014 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ ఇదే తరహా తప్పిదంతో మూల్యం చెల్లించుకున్నాడు. గాయంతో అప్పటి కెప్టెన్ ధోనీ దూరమవడంతో వైస్ కెప్టెన్ హోదాలో జట్టును నడిపించిన విరాట్.. ఇలానే కీలక బౌలర్లతో ముందుగా బౌలింగ్ చేయించి చివరి ఓవర్‌ను స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌లో పాక్ విజయానికి 10 పరుగులు చేయాల్సి రాగా.. నవాజ్ తరహాలోనే తొలి బంతికే అశ్విన్.. పాక్ బ్యాటర్‌ను బౌల్డ్ చేశాడు. కానీ ఆ తర్వాత షాహిద్ అఫ్రిది సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. తాజా మ్యాచ్ హార్దిక్ ఆ పని చేయడంతో రెండు మ్యాచ్‌లను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

సిక్సర్‌తో గెలిపించిన హార్దిక్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(43), షానవాజ్ దహాని(16) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వకుమార్ నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.
అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో మెరిసిన హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33 నాటౌట్) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. అతనికి అండగా విరాట్ కోహ్లీ(35), రవీంద్ర జడేజా(35) రాణించారు. పాక్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నసీమ్ షా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్ మూడు వికెట్లతో చెలరేగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications