చాహల్ లాంటి స్పిన్నర్ లేడు.. పేస్‌లో పదును లేదు.. నాసిరకంగా పాకిస్థాన్ బౌలింగ్: ఆకాశ్ చోప్రా

న్యూఢిల్లీ: ఆసియాకప్ బరిలో నిలిచిన పాకిస్థాన్ జట్టు బౌలింగ్ మరీ నాసిరకంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్, రషీద్ ఖాన్ వంటి వికెట్ టేకర్లు లేరని, పేస్ విభాగంలో పదును లేదని అభిప్రాయపడ్డాడు. శనివారం నుంచి ఆసియాకప్ 2022 టీ20 టోర్నీ ప్రారంభమవ్వనుండగా ఆదివారం దాయదీ దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. గత టీ20 ప్రపంచకప్ తర్వాత మళ్లీ దాయాదీ దేశాలు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పాకిస్థాన్ బలహీనతల గురించి చర్చించాడు.

వికెట్ టేకర్ లేడు..
'ఆసియాకప్ బరిలో నిలిచిన పాకిస్థాన్ జట్టులో వికెట్ టేకింగ్ స్పిన్నర్ లేడు. వారికి చాలా స్పిన్ ఆప్షన్స్ ఉన్నా.. వికెట్లు తీసేవారు మాత్రం కనిపించడం లేదు. అందరూ పొదుపుగా బౌలింగ్ చేసేవారే. షాదాబ్ ఖాన్.. పీఎస్‌ఎల్‌లో అదరగొట్టాడు. కానీ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. వన్డేల్లో సైతం అతను వికెట్లు తీయలేకపోయాడు. అలాంటి వ్యక్తి వికెట్ టేకర్ ఎలా అవుతాడు. అతను యుజ్వేంద్ర చాహల్, రషీద్ ఖాన్‌లో కీలక వికెట్లు తీయలేడు.

అనుభవం లేని స్పిన్నర్లు..
మరో స్పిన్నర్ ఉస్మాన్ ఖదీర్‌కు ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ అతనికి అంతగా అనుభవం లేదు. అతను చాలా తక్కువ క్రికెట్ ఆడాడు. నవాజ్‌ది ఇదే పరిస్థితి. పొదుపుగా బౌలింగ్ చేయగలడు కానీ వికెట్ తీయలేడు. దుబాయ్ పిచ్‌లో సహజంగానే టర్న్ ఉండదు. అలాంటప్పుడు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆ సామర్థ్యం కలిగిన స్పిన్నర్లు పాక్ జట్టులో ఒక్కరు కనిపించడం లేదు. 'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

పేస్‌లో పదును లేదు..
ఇక పేస్ విభాగంలో అనుభవలేమి కొట్టిచ్చినట్లు కనబడుతుందన్న ఆకాశ్ చోప్రా..షాహిన్ అఫ్రిది లేని లోటు ఆ జట్టుకు తెలుసొస్తుందని చెప్పాడు. 'పాకిస్థాన్ పేస్ విభాగంంలో అనుభవలేమి కనిపిస్తోంది. జట్టులో చాలా మంది పేసర్లున్నా.. వారికి అంతగా అంతర్జాతీయ అనుభవం లేదు. నసీమ్ షా ఇటీవలే వన్డే క్రికెట్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్ షురూ చేశాడు. ఐదు వికెట్లు మాత్రమే తీసినా అతను టీ20ల్లో ఎలా రాణిస్తాడో చూడాలి.

షాహీన్ అఫ్రిది లేని లోటు..
షాన్‌వాజ్ దహనీ పీఎస్‌ఎల్‌లో సత్తా చాటాడు. కానీ ఇంటర్నేషన్ క్రికెట్ పెద్దగా ఆడింది లేదు. హస్నైన్ పరిస్థితి కూడా ఇంతే. హ్యారీస్ రౌఫ్ ఒక్కడే అనుభవం కలిగిన పేసర్. షాహిన్ అఫ్రిది లేని లోటు వారికి తెలుసొస్తుంది.'అని చోప్రా అభిప్రాయపడ్డాడు. చివరి నిమిషంలో షాహిన్ అఫ్రిది గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications