
1. టాస్ ఓడిపోవడం..
ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలవకపోవడం భారత్ కొంపముంచింది. టాస్‌కు ప్రాముఖ్యత ఇవ్వమని ఆయా జట్ల కెప్టెన్లు ప్రగల్భాలు పలికినా.. దుబాయ్ మైదానంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయడం అడ్వాంటేజ్‌గా మారింది. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండటం.. ఆ తర్వాత బ్యాటింగ్ ట్రాక్‌గా మారాడం చేజింగ్ టీమ్స్‌కు కలిసొస్తుంది. గత రెండేళ్లలో ఇక్కడ మొత్తం 18 మ్యాచ్‌లు జరగ్గా.. 16 మ్యాచ్‌లు మొదట ఫీల్డింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఆ రెండు మ్యాచ్‌లు కూడా హాంగ్ కాంగ్, ఐర్లాండ్ వంటి చిన్నదేశాలే ఓటమిపాలయ్యాయి. ప్రస్తుత టోర్నీలో దుబాయ్ వేదికగా 6 మ్యాచ్‌లు జరగ్గా 5 మ్యాచ్‌ల్లో చేజింగ్ జట్టే గెలిచింది. ఒకే ఒక్క మ్యాచ్.. అది కూడా హాంగ్ కాంగ్‌పై భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి నెగ్గింది. సూపర్ 4లో భారత్ వరసగా రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడి మూల్యం చెల్లించుకుంది.

2. ఫినిషర్స్ వైఫల్యం..
టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు పరుగులు చేయలేక చేతులెత్తేయడం టీమిండియా కొంపముంచింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ 97 పరుగుల భాగస్వామ్యం అందించినా.. ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు ఆ మూమెంటమ్‌ను కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దీపక్ హుడా వైఫల్యం జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంది. ఫినిషర్ అయిన దినేశ్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకోకపోవడం కూడా చేటు చేసింది. ఈ మ్యాచ్‌లో కార్తీక్ ఆడుంటే చివర్లో విలువైన పరుగులు చేసేవాడు.

3. పేలవ బౌలింగ్..
174 పరుగుల సాధారణ లక్ష్యాన్ని డిఫెండ్ చేయాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయడం కీలకం. ముఖ్యంగా పవర్ ప్లేలోనే వికెట్లు పడగొట్టాలి. కానీ ఈ విషయంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య వరుసగా బౌలింగ్ చేసి పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీసినా.. పేసర్లు కనీసం ప్రభావం చూపలేకపోయారు. అయినా మ్యాచ్ ఆఖరి ఓవర్‌కు తీసుకెళ్లినా.. కీలక 19వ ఓవర్ అర్షదీప్‌కు కాకుండా భువనేశ్వర్‌కు ఇచ్చి రోహిత్ ఘోర తప్పిదం చేశాడు. భువీ ఆ ఓవర్‌లో తక్కువ పరుగులిచ్చినా.. లేక ఆ ఓవర్ అర్షదీప్ బౌలింగ్ చేసినా ఫలితం మరోలా ఉండేది.

4.హార్దిక్ పాండ్యా ఫ్లాఫ్ షో..
పాకిస్థాన్‌తో టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన హార్దిక్ పాండ్యా.. తరువాతి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా శ్రీలంకతో అటు బ్యాటింగ్.. ఇట బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్‌లో 17 పరుగులు చేసిన హార్దిక్... బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి ఒక్క తీయకుండా 35 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ ఏ ఒక్క విభాగంలో రాణించినా టీమిండియాకు ఆశించిన ఫలితం దక్కేది.

5. రిషభ్ పంత్ ఘోర తప్పిదం..
కీలక సమయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన ఘోర తప్పిదం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. యుజ్వేంద్ర చాహల్ వేసిన 15వ ఓవర్‌లో తొలి బంతికే క్రీజులోసెట్ అయిన మెండీస్ ఔటవ్వగా.. రెండో బంతికి డసన్ షనక స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కాడు. పంత్ గనుక అతన్ని స్టంపౌట్ చేస్తే డసన్ షనక డకౌట్‌గా వెనుదిరిగేవాడు. అప్పుడు టీమిండియా విజయవకాశాలు మెరుగ్గా ఉండేవి. ఆ అవకాశాన్ని అందుకున్న షనక 18 బంతుల్లో 33 పరుగులు చేసి భారత విజయవకాశాలను దెబ్బతీసాడు.


Click it and Unblock the Notifications
