Asia Cup 2022: ఈ నాలుగు కారణాలే విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ అనేలా చేసాయి!

హైదరాబాద్: ఆసియాకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. చూడటానికి చిన్న టార్గెటే.. కానీ బంతికి బంతికి ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33 నాటౌట్, 3/25) అద్భుతం చేశాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సూపర్ షో చూపెట్టడంతో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. రిజ్వాన్(43) మినహా అంతా విఫలమయ్యారు.
అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ(35), జడేజా(35) హార్దిక్ అండగా రాణించారు. ఈ విజయంతో గతేడాది ప్రపంచకప్‌లో ఎదురైన పరాభావానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో మరోసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నాలుగు కారణాలు విరాట్ కంటే రోహిత్ గొప్ప కెప్టెన్ అనే విషయాన్ని స్పష్టం చేశాయి.

టాస్ గెలవడం..
రోహిత్ శర్మకు బీభత్సమైన లక్ ఉంటుంది. అతను ఎప్పుడు కెప్టెన్‌గా బరిలోకి దిగినా టాస్ గెలుస్తుంటాడు. 99.9 శాతం వరకు అతను టాస్ గెలిచాడు. దీని వల్ల మైదాన పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్, ఫీల్డింగ్ తీసుకునే వెసులుబాటు అతనికి కలిగింది. నిన్నటి మ్యాచ్‌లోనూ రోహిత్‌కు టాస్ గెలవడం కలిసొచ్చింది. టాస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని రోహిత్ చెప్పినా.. అతను టాస్ గెలవగానే ఇండియా గెలించిందంటూ ఫ్యాన్స్ చేసి గోలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత కీలకమో. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పుడూ టాస్ ఓడిపోయేవాడు. ఒకటి రెండు సార్లు మినహా కీలక మ్యాచ్‌ల్లో ప్రతీసారి విరాట్ టాస్ ఓడిపోయాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ పాక్‌తో విరాట్ టాస్ ఓడి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.

ఆరో బౌలింగ్ ఆప్షన్..
ఇక రోహిత్ ఎప్పుడూ తన జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉంచుకుంటాడు. అది ఐపీఎల్ అయినా అంతర్జాతీయ మ్యాచ్ అయినా బౌలర్లకు అవకాశం కల్పిస్తాడు. తద్వారా మైదానంలో అతనికి వ్యూహాలు రచించేందుకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఉదహారణకు నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ ఆవేశ్ ఖాన్‌ను ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా ఉపయోగించుకున్నాడు. మరోవైపు పాక్ మాత్రం కేవలం ఐదుగురు బౌలర్లతోనే ఆడింది. దాంతో ఆ జట్టుకు చివరి ఓవర్ వేయడానికి పేసర్ లేకుండా పోయాడు. దాంతో స్పిన్నర్‌తో వేయించాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పుడు ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాడు. దాంతో అతను బాబర్‌లానే తడబడి మూల్యం చెల్లించుకున్నాడు.

ఎక్స్‌ఫ్యాక్టర్ ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ హయాంలో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం టాప్-3 బ్యాటర్లు అయిన రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీపైనే ఆధారపడింది. అయితే కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో ఈ ముగ్గురు విఫలమయ్యేవారు. దాంతో భారత్ ఓటమి ఖాయమైపోయేది. ఆ తర్వాత వచ్చే బ్యాటర్లలో ధోనీ, జడేజా వంటి ఆటగాళ్లు పోరాడినా ఫలితం దక్కేది కాదు. కానీ రోహిత్ కెప్టెన్సీలో ఈ ముగ్గురు బ్యాటర్లతో పాటు ఇతర ఆటగాళ్లు రాణిస్తున్నారు. పంత్, హార్దిక్, కార్తీక్, జడేజాలు కూడా స్పెషలిస్ట్ బ్యాటర్లలో చెలరేగుతున్నారు. దాంతో రోహిత్ పని సులువవుతోంది.

ధోనీ తరహాలో..
మైదానంలో రోహిత్ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో అతను ఆటను బాగా రీడ్ చేస్తాడు. ఈ క్రమంలోనే పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్, ఫీల్డ్ ప్లేస్‌మెంట్ పెడుతారు. బౌలర్లతో కలిసి బ్యాటర్లకు వ్యూహాలు రచిస్తాడు. మూసదోరణి కెప్టెన్సీకి దూరంగా ఉంటూ.. ప్రయోగాత్మక నిర్ణయాలను తీసుకుంటాడు. విరాట్ కోహ్లీ మాత్రం టీమ్ ప్లాన్స్‌ను అమలు చేయడంపైనే ఫోకస్ పెట్టేవాడు తప్పా కొత్తగా నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. ఆటను అర్థం చేసుకోవడంలో తడబడేవాడు. దూకుడుగా ఉంటూ ఆటగాళ్లను ఉత్సాహపరిచినా పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోలేకపోయేవాడు. అన్నిటి కంటే ముఖ్యం రోహిత్‌కు లక్ ఫేవర్ చేస్తే విరాట్‌ను దురదృష్టం వెంటాడేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications