
కత్తి మీద సామే..
అసలు దినేశ్ కార్తీక్‌ను తీసుకోవాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఈ నిర్ణయం తమను షాక్‌కు గురిచేసిందని అభిప్రాయపడ్డారు. అయితే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒక్కడే ద్రవిడ్ అండ్ కో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్విటర్ వేదికగా సమర్థించాడు. దినేశ్ కార్తీక్‌ను తీసుకోవడానికి గల కారణం ఏంటో కూడా చెప్పాడు. 'దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ డౌన్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తారు. ఈ జోడీని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు కత్తి మీద సామే.'అంటూ భజ్జీ టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని కొనియాడాడు. ఇక హర్భజన్ చెప్పినట్లుగానే దినేశ్ కార్తీక్‌ను ఆడించడానికి ఓ మూడు బలమైన కారణాలున్నాయి.

1. స్పిన్, పేస్‌ను దంచికొట్టడమే..
డెత్ ఓవర్లలో కెప్టెన్లు తరుచూ పేస్ బౌలర్లను ఉపయోగిస్తుంటారు. అయితే దినేశ్ కార్తీక్ పేసర్లను సమర్థవంతంగా ఆడగలడు. ముఖ్యంగా లోయరార్డర్‌లో బ్యాటింగ్ వచ్చే అతనికి టీ20 ఫార్మాట్‌లో పేసర్లపై ఘనమైన రికార్డు ఉంది. అలాగే స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. 14 ఇన్నింగ్స్‌ల్లో కార్తీక్ పేసర్లపై 86 యావరేజ్‌తో 258 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 224 కాగా.. కేవలం మూడు సార్లు మాత్రమే పేస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్పిన్నర్లను కూడా దినేశ్ కార్తీక్ ధీటుగా ఎదుర్కొన్నాడు. 110 స్ట్రైక్‌రేట్‌తో 72 రన్స్ చేశాడు. ఈ క్రమంలోనే డెత్ ఓవర్లలో కార్తీక్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తాడని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది.

2.పంత్ కన్నా 10 రెట్ల అనుభవం..
రిషభ్ పంత్‌తో పోలిస్తే దినేశ్ కార్తీక్‌కు పది రెట్ల అనుభవం ఉంది. 2006లో టీమిండియా ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో కార్తీక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. కార్తీక్ మిడిల్ ఆర్డర్‌లో కూడా ఆడగలడు. అంతేకాకుండా జడేజాను అప్‌ది ఆర్డర్ ప్రమోట్ చేసి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సమస్యకు చెక్ పెట్టారు. దాంతో పంత్ లేని లోటు తీరింది. జట్టుకు సరైన ఫినిషర్ కావాలనే ఉద్దేశంతోనే దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇచ్చారు. ఐపీఎల్‌లో అతను ఈ రోల్ సమర్థవంతంగా నిర్వర్తించడంతో ఆసియా కప్‌లో అతని సేవలు వినియోగించుకుంటున్నారు.

3. ధాటిగా ఆడగలిగే సామర్థ్యం..
దినేశ్ కార్తీక్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున హిట్టర్‌గా బరిలోకి దిగడం అతని రాతనే మార్చేసింది. ఆ జట్టు తరఫున అతను 183 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేసిన అతను.. ఓడే మ్యాచ్‌లో జట్టుకు విజయాలందించాడు. అంతేకాకుండా చివరి నాలుగు ఓవర్లలో 207 స్ట్రైక్‌రేట్‌తో 251 పరుగులు చేశాడు. ఈ గణంకాలే పంత్‌ను కాదని అతనికి అవకాశం ఇచ్చేలా చేసాయి.


Click it and Unblock the Notifications












