పాక్ క్రికెటర్ షూ లేస్ కట్టిన చాహల్, నెటిజన్ల విమర్శలు


దుబాయి: ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో తలపడిన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎన్నో అంచనాలతో మొదలైన ఈ మ్యాచ్‌ను రోహిత్‌సేన సునాయాసంగా గెలిచి చూపించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 43.1 ఓవర్లకు కేవలం 162 పరుగులు చేయగలిగింది. ఈక్రమంలో చేధనకు దిగిన భారత్ సునాయాసంగా పాక్‌పై జయభేరీ మోగించింది.

భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడిన రోహిత్
బ్యాటింగ్‌లో భారత కెప్టెన్ రోహిత్‌శర్మ జోరుగా ఆడాడు. రోహిత్ విధ్వంసానికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (52) 39 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సులు, శిఖర్ ధావన్ (46) 54 బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్సు చెలరేగి శుభారంభం అందించారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకు పడిన రోహిత్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇది అతడి కెరీర్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
మ్యాచ్ గెలిపించింది.. బౌలర్లే: రోహిత్ శర్మ

చెలాయించి తక్కువ స్కోరుకే కట్టడి
ఇంతటి విజయాన్ని బౌలర్లకే ఆపాదించాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ. దాయాది జట్టుపై భారత బౌలర్లు తొలి నుంచీ ఆధిపత్యం చెలాయించి తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఈ క్రమంలో టార్గెట్‌ను 29 ఓవర్లలోనే భారత్ పూర్తి చేయగలిగింది. ఇలా జట్టును గెలిపించడంలోనే కాదు. జెంటిల్‌మెన్ గేమ్ అయిన క్రికెట్‌లో అంతే క్రీడా స్ఫూర్తితో వ్యవహరించారు.
నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో చాహల్ ఫీల్డింగ్‌లో
42.4 ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్న పాక్ క్రికెటర్‌లు ఉస్మాన్ ఖాన్, మొహమ్మద్ అమీర్ క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్ 162/9 స్కోరుతో ఇంకా పరుగులు రాబట్టాలని యోచిస్తోంది. ఆ సమయంలో ఉస్మాన్‌కు కుడి పక్కగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో చాహల్ ఫీల్డింగ్‌లో ఉన్నాడు. షూ లేస్ ఊడిపోవడంతో.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉస్మాన్‌కు సహకరించాడు. దీంతో ఈ ఫొటో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
కొడుకు షూ లేస్ తండ్రి కడుతున్నా
'చూసే కళ్లను బట్టి లోకం పోకడ కనబడుతోంది' అన్నట్లు వాళ్లు క్రీడా స్ఫూర్తితో వ్యవహరిస్తే.. నెటిజన్లు మాత్రం ప్రశంసలతో పాటు విమర్శలకు పాల్పడుతున్నారు. కొడుకు షూ లేస్ తండ్రి కడుతున్నాడు. అని కొందరు .. నేనైతే రెండు షూలు కట్టేసే వాడినంటూ విమర్శలకు దిగుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications