Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో ఫన్నీగా చెప్పిన అశ్విన్ సతీమణి ప్రీతీ నారాయణన్..!

 Ashwins Wife Prithi shares Funniest Messages About Their First Night Together After Marriage

చెన్నై: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నేడు(శనివారం) 37వ జన్మదినం జరుపుకుంటున్నాడు. దాంతో అతనికి క్రీడా, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ ఏడాది కూడా అతను కెరీర్‌లో మంచి సక్సెస్ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక టెస్ట్‌ల్లో వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అయిన అశ్విన్.. 255 అంతర్జాతీయ మ్యాచుల్లో 659 వికెట్లు తీయడంతో పాటు 5 సెంచరీలతో 3799 పరుగులు చేశాడు. అనిల్ కుంబ్లే తర్వాత భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే ఐసీసీ టైటిల్‌ను ముద్దాడి సగర్వంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ప్రీతీ చాలా ఫన్నీ..

ప్రీతీ చాలా ఫన్నీ..

అయితే అశ్విన్ సక్సెస్‌కు అతని సతీమణి ప్రీతి నారాయణ్ కారణమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి నారాయణన్ షేర్ చేసిన ఓ ఫన్నీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ అశ్విన్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే ప్రీతి నారాయణన్, బోల్డ్ అండ్ హాట్ కామెంట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అశ్విన్‌లాగే ప్రీతి కూడా చాలా ఫన్నీగా చమత్కారానికి కాస్త వెటకారం జోడించి పోస్టులు చేస్తూ ఉంటుంది. రవిచంద్రన్ అశ్విన్‌ను పెళ్లాడిన తర్వాత తన మొదటి రాత్రి అనుభవాన్ని విచిత్రంగా ప్రీతీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

అలారం పెట్టి డిస్టర్బ్ చేశారు..

అలారం పెట్టి డిస్టర్బ్ చేశారు..

అయితే తమ శోభనాన్ని క్రికెట్ మ్యాచ్‌తో పోల్చుతూ ఆమె వివరించిన స్టోరీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. శోభనం ముందు రోజు 'తన(అశ్విన్‌)కి రేపు మ్యాచ్ ఉంది. దయచేసి పడుకోనివ్వండని మా కుటుంబ సభ్యులకు ఎంతగానో చెప్పాను. అయితే మా వాళ్లు కావాలని ఎన్నో గడియారాల్లో అలారం పెట్టి నిద్రను పాడుచేశారు. అయితే ఆ తర్వాతి రోజు మేం మ్యాచ్(శోభనం) ఆడాం. అది నా మొదటి టెస్టు. నేను చాలా కంగారుగా, ఆతృతగా ఉన్నా. కానీ అశ్విన్ ఫీల్డ్‌లో ఉన్నాడనే విషయం నేను మరిచిపోయా. ఇతనికేమో అప్పటికే 300 వికెట్లు పడిపోయాయి. 'అంటూ ప్రీతీ కొంటెగా రాసుకొచ్చింది. మొదటి రాత్రిని మ్యాచ్‌గా సంబోధించి, సోషల్ మీడియా జనాల అభిమానాన్ని చాటుకుంది.

మ్యాచ్‌ టైమ్‌లో కూడా సందడి చేస్తూ..

మ్యాచ్‌ టైమ్‌లో కూడా సందడి చేస్తూ..

6 ఏళ్ల క్రితమే తమ పెళ్లి రోజు సందర్భంగా ప్రీతీ తమ ఫస్ట్ నైట్ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంది. అయితే ఈ ఇద్దరి ప్రస్తావన వచ్చిన ప్రతీసారి అభిమానులు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. రవిచంద్రన్ అశ్విన్, ప్రీతి నారాయణన్‌లకు ఆద్య, అకీరా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు... అశ్విన్‌ ఆడే ప్రతీ మ్యాచ్‌లో వీరి సందడి మామూలుగా ఉండదు. రోహిత్ శర్మ కూతురు సమైరా, అజింక్యా రహానే కూతురు ఆర్యలకు అశ్విన్ ఇద్దరు పిల్లలు బెస్ట్ ఫ్రెండ్స్. ఇక మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిన సమయంలో ప్రీతీ భారత అభిమానులకు అక్కడి అప్‌డేట్స్ కూడా ఇచ్చేది. మ్యాచ్ జరిగేది.. జరగనది చెప్పేది.

Story first published: Saturday, September 17, 2022, 14:47 [IST]
Other articles published on Sep 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+