Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, రుతురాజ్ కాదు.. అతని బ్యాటింగ్ మైండ్ బ్లోయింగ్: అశ్విన్

సౌతాఫ్రికా యువ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్‌తో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(2/63) రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(1/43), లుంగి ఎంగిడి(1/51) చెరో వికెట్ తీసారు.

అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రిట్జ్‌కే(64 బంతుల్లో 5 ఫోర్లతో 68), డెవాల్డ్ బ్రెవిస్(34 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

Ashwin Calls Dewald Brevis Flick-and-Blast Knock a Brev-Ball Box-Office Hit After IND vs SA 2nd ODI

కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ శతకాలతో చెలరేగినా తనను డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ ఆకట్టుకుందని అశ్విన్ ట్వీట్ చేశాడు. అతని బ్యాటింగ్ బాక్సాఫిస్ హిట్ అని ఎక్స్‌వేదికగా పేర్కొన్నాడు. 'బ్రేవ్ బాల్ ఈజ్ బాక్సాఫిస్'అని ట్వీట్ చేశాడు. అతని ఫియర్‌లెస్ గేమ్ అమోఘమని, అద్భుతమైన సినిమాను చూసినట్లుందని పేర్కొన్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పాడు. 5 భారీ సిక్స్‌లతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Story first published: Thursday, December 4, 2025, 11:10 [IST]
Other articles published on Dec 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+