Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: చరిత్ర సృష్టించిన అశ్వని కుమార్.. 18 ఏళ్ల తర్వాత!

ముంబై ఇండియన్స్ యువ సంచలనం అశ్వని కుమార్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అశ్వని కుమార్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన అశ్వని కుమార్.. తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేశాడు.

తన రెండో ఓవర్‌లో డేంజరస్ రింకూ సింగ్‌తో పాటు మనీష్ పాండే‌ను పెవిలియన్ చేర్చాడు. రింకూ సింగ్‌ను క్యాచ్ ఔట్ చేసిన అశ్వని కుమార్.. మనీశ్ పాండే‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక తన మూడో ఓవర్‌లో విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో అరంగేట్ర ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

Ashwani Kumar Creates History Becomes First Indian To Take A Four-For On IPL Debut

అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అల్జారీ జోసెఫ్(6/12) టాప్‌లో ఉన్నాడు. 2019లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్ర చేసి..6 వికెట్లు పడగొట్టాడు. అల్జారీ జోసెఫ్ తర్వాత ఆండ్రూ టై(5/17), షోయబ్ అక్తర్(4/11).. అశ్వని కుమార్ కన్నా ముందున్నారు. కేవన్ కూపర్(4/26), డేవిడ్ వైస్(4/33) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

6/12 - అల్జారి జోసెఫ్ (MI) vs SRH, 2019
5/17 - ఆండ్రూ టై (GL) vs RPS, 2017
4/11 - షోయబ్ అక్తర్ (KKR) vs DD, 2008
4/24 - అశ్వని కుమార్ (MI) vs KKR, 2025*
4/26 - కెవాన్ కూపర్ (RR) vs KXIP, 2012
4/33 - డేవిడ్ వైస్ (RCB) vs MI, 2015

తొలి బంతికే వికెట్..
అరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన 10వ బౌలర్‌గా అశ్వని కుమార్ నిలిచాడు. అతని కన్నా ముందు ఇషాంత్ శర్మ, విల్కిన్ మోటా, షేన్ హర్వూడ్, అమిత్ సింగ్, ఛార్ల్, అలి ముర్తాజా, టీ సుధింద్రా, అల్జారీ జోసెఫ్, మతీష పతీరణలు ఉన్నారు.

Story first published: Monday, March 31, 2025, 22:22 [IST]
Other articles published on Mar 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+