Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఒక్క వికెట్ నాకు వదిలేయమని మహ్మద్ షమీని వేడుకున్నా!

Ashok Dinda reveals a story when he requested Mohammed Shami not to take a wicket

కోల్‌కతా: టీమిండియా మాజీ పేసర్, దేశవాళీ దిగ్గజం అశోక్ దిండా గత మంగళవారం అన్ని రకాల క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దశాబ్దకాలం పాటు బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన దిండా.. గత సీజన్‌కు ముందు గోవాకు మారాడు. ఈ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆ జట్టు తరఫున బరిలోకి దిగాడు. అయితే ఈ ధనాధన్ టోర్నీ‌లో గోవా నాకౌట్ చేరుకోలేదు.

దాంతో ఈ టోర్నీ అనంతరం దిండా ఆటకు అల్విదా ప్రకటించాడు. ఇక తన రిటైర్మెంట్ నేపథ్యంలో స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిండా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన సహచర ఆటగాడు, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఓ మ్యాచ్‌లో వికెట్ కోసం వేడుకున్నానని గుర్తు చేసుకున్నాడు.

100వ మ్యాచ్.. 10 వికెట్లు..

100వ మ్యాచ్.. 10 వికెట్లు..

'నేను షమీతో ఆడిన ఆఖరి మ్యాచ్‌ నాకింకా గుర్తుంది. అది నా 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్. చత్తీస్‌గడ్‌తో ఆడుతున్నాం. రెండు రోజుల్లేనే మేం మ్యాచ్‌ను ముగించాం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో షమీ, నేను ఐదేసి వికెట్లు తీశాం. రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరం మరో నాలుగేసి వికెట్లు పడగొట్టాం. నాకు 10 వికెట్ల ఘనతను అందుకోవడానికి మరొక వికెట్ కావాలి. 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకోవాలనుకున్నాను. వెంటనే షమీకి నేను ఓ రిక్వెస్ట్ చేశాను. నీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం ఆశించలేదు. అడగలేదు. కానీ ఈ ఒక్కసారికి ఆ వికెట్ నాకు వదిలేయవా.. ప్లీజ్.. అని విజ్ఞప్తి చేశాను. ఇక మేం ఫీల్డర్లందరిని స్లిప్‌లో పెట్టి బౌలింగ్ చేశాం. నేను 10 వికెట్ పడగొట్టి షమీకి థ్యాంక్స్ చెప్పాను'అని దిండా గుర్తు చేసుకున్నాడు.

 భారత్ తరఫున 29 వికెట్లు..

భారత్ తరఫున 29 వికెట్లు..

భారత్ తరఫున 13 వన్డేలు, 9 టీ20లు ఆడిన దిండా..12, 17 చొప్పున మొత్తం 29 వికెట్లు తీశాడు. 2009లో శ్రీలంకపై నాగ్‌పూర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దిండా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే (1/34) ఆకట్టుకున్నాడు. సనత్ జయసూర్య అతని ఫస్ట్ ఇంటర్నేషనల్ వికెట్. ఇంగ్లండ్‌తో 2013లో జరిగిన వన్డే అతని కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. అందులో ఈ బెంగాల్ క్రికెటర్ (2/53) రాణించాడు. కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్‌లను ఔట్ చేశాడు.

 420 వికెట్లు..

420 వికెట్లు..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆకట్టుకోలేకపోయినా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం దిండా అద్భుతంగా రాణించాడు. బెంగాల్ తరఫున దశాబ్దకాలం ఆడిన అశోక్ దిండా.. 116 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 420 వికెట్ల పడగొట్టాడు. ఇందులో 26 సార్లు ఐదు వికెట్ల ఘనతను, 5 సార్లు 10 వికెట్ల హాల్స్ ‌అందుకున్నాడు. ఫలితంగా బెంగల్ తరఫు సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పుణే వారియర్స్, రైజింగ్ పుణే సూపర్ గేయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 78 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ క్రికెటర్ 68 వికెట్లు పడగొట్టాడు.

దిండా అకాడమీ..

దిండా అకాడమీ..

ఇక 2013 వరకు గొప్పగా సాగిన అతని కెరీర్ క్రిస్ గేల్ పుణ్యమా భవిష్యత్తు లేకుండా పోయింది. అదే ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో అప్పటి ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ దిండా బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ఆ మ్యాచ్‌లో ఈ విండీస్ వీరుడి ధాటికి దిండా ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఏ బౌలర్ ఎక్కువ పరుగులిచ్చినా.. ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకపోయినా దిండా అకాడమీ, క్లబ్‌లోకి స్వాగతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు.

Story first published: Friday, February 5, 2021, 14:30 [IST]
Other articles published on Feb 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+