Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం!

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ ఆష్లే గార్డనర్‌పై అక్రమ సంబంధం ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆష్లేకు సహచర క్రికెటర్‌తో వివాహేతర సంబంధం ఉందని ఆమె భాగస్వామి, స్వలింగ సంపర్కురాలైన మోనికా రైట్ ఆరోపించింది. ఆష్లే గార్డ్‌నర్ తనను మోసం చేసిందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. ఆస్ట్రేలియా ఓపెనర్ జార్జియా వోల్‌తో ఆష్లే గార్డెనర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఆరోపించింది. ప్రస్తుతం ఈ ఆరోపణలు ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలకలం సృష్టించాయి.

2002లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ఆష్లే గార్డ్‌నర్, మోనికా రైట్ పరిచయమయ్యారు. ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ.. 2025 ఏప్రిల్‌లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి అయిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని, అప్పటి నుంచి విడిగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి.

Ashleigh Gardner Ex Partner Monica Wright Publicly Accuses Her of Cheating with Teammate Georgia Voll

భారత్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సందర్భంగా ఆష్లే గార్డ్‌నర్‌ను చూడటానికి ఇక్కడికి వచ్చినా.. మోనికాను ఆమె పట్టించుకోలేదని, వెడ్డింగ్ రింగ్‌ను కూడా తీసేసిందని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై మోనికా రైట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది.

ఈ వార్తలు అసంబద్దమైనవిగా పేర్కొంటూనే.. ఆష్లే గార్డ్‌నర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఆస్ట్రేలియా యువ ఓపెనర్ జార్జియా వోల్ ఫొటోను షేర్ చేస్తూ.. 'నా భాగస్వామికి ఈమెతో ఎఫైర్ ఉంది. ఈమె కోసమే నన్ను మోసం చేసింది.'అని పేర్కొంది. ఆష్లేగార్డనర్, మోనికా రైట్ ఒక బిడ్డను కనాలని ప్రణాళిక వేసుకున్నారు.

అందుకోసం ఆసుపత్రిలో రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు. కానీ ఈ ఆకస్మిక ఎడబాటు కారణంగా మోనికా ఆ రిజర్వేషన్‌ను రద్దు చేసుకుంది. ఈ అక్రమ సంబంధ వ్యవహారం ఆస్ట్రేలియా మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై స్పందించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు నిరాకరించారు. ఆస్ట్రేలియా జట్టులోని ఈ అక్రమ సంబంధం జట్టుపై ఫలితాలపై ప్రభావం చూపుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆసీస్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఆసీస్.. రికార్డు స్థాయిలో ఏడో సారి టైటిల్‌ను అందుకుంది. ఈ టోర్నీలో ఆష్లే గార్డ్‌నర్‌తో పాటు యువ ఓపెనర్ జార్జియా వోల్ అద్భుత ప్రదర్శన కనబర్చింది.

Story first published: Monday, July 13, 2026, 17:23 [IST]
Other articles published on Jul 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+