For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తాగిన మైకంలో చాహల్, నెహ్రా రచ్చ..! (వీడియో)

Ashish Nehra, Yuzvendra Chahals Exchange After Getting ‘Full Talli’ Has Fans In Splits

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా, వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్ ముగిసిన అనంతరం ఓ పార్టీలో కలిసి ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పార్టీ అయిన తర్వాత చాహల్‌ను నెహ్రా.. 'అరే బస్ లో వెళ్దాం రా..' అంటే దానికి చాహల్.. 'అన్నా నేను కార్లో వెళ్తా..'అని రిప్లై ఇచ్చాడు.

నా వైఫ్ కూడా ఉంది. తనను వదిలి ఎలా రావాలి..'అని బదులిచ్చాడు. దానికి నెహ్రా స్పందిస్తూ.. 'అవునా.. నీ భార్య కూడా మనతో పాటే బస్ లో వస్తుంది పదా..' అంటూ కార్ ఎక్కబోతున్న ధనశ్రీ వర్మను కూడా బస్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఇద్దరి మాటలు, ప్రవర్తన చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 'తాగి మాట్లాడుతున్నారా..?' 'రోడ్ మీద ఆ రచ్చ ఏంటి..?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తో నెహ్రా క్లోజ్‌గా ఉంటాడు. నెహ్రా ఆర్‌సీబీ కోచింగ్ టీమ్‌లో ఉన్నప్పుడు చాహల్ తో క్లోజ్‌గా ఉండేవాడు.ఐపీఎల్-15లో చాహల్.. 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీసి సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ సీజన్ లో ఓ హ్యాట్రిక్ తో పాటు ఒక మ్యాచ్ లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన చాహల్‌కే పర్పుల్ క్యాప్ దక్కింది. ఇక నెహ్రా.. గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ఐపీఎల్ టైటిల్ అందించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

Story first published: Tuesday, June 7, 2022, 14:22 [IST]
Other articles published on Jun 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+