Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashish Nehra: రోహిత్ శర్మ విధ్వంసానికి కోహ్లీనే కారణం!

Ashish Nehra, IND vs AUS, World Cup 2023 Final: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీలపై దిగ్గజ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారని కొనియాడాడు. ఈ ఇద్దరి సక్సెస్‌కు కారణం వారి మధ్య ఉన్న సమన్వయమేనని తెలిపాడు.

జట్టు విజయం కోసం ఇద్దరూ కలిసి ఆడుతున్నారని, ఒకరు ధాటిగా ఆడితే మరొకరు పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేస్తున్నారని ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ ఉన్నాడనే భరోసాతోనే రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆడుతున్నాడని నెహ్రా అభిప్రాయపడ్డాడు. అదే విధంగా కోహ్లీ మంచి టైమింగ్‌తో బ్యాటింగ్ చేయడానికి రోహిత్ శర్మనే కారణమన్నాడు.

Ashish Nehra says Why Rohit Sharma is able to play so fearless is because of Virat Kohli

రోహిత్ శర్మ అందించే శుభారంభాలతో ఎలాంటి ఒత్తిడి లేకుండా విరాట్ కోహ్లీ స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తున్నాడని వివరించాడు. వన్డే ప్రంచకప్ 2023 ఫైనల్ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'విరాట్ కోహ్లీ ఉన్నాడనే భరోసాతోనే రోహిత్ శర్మ స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తూ వేగంగా పరుగులు చేస్తున్నాడు. కోహ్లీ టైమింగ్‌తో బ్యాటింగ్ చేయడానికి రోహిత్ శర్మనే కారణం. ఈ ఇద్దరూ నాణానికి రెండు వైపుల వంటి వారు. జట్టు విజయం కోసం కలిసి ఆడాలనే తపన వీరిలో బలంగా కనిపిస్తోంది.'అని ఆశీష్ నెహ్రా విశ్లేషించాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నాడు. తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై అటాకింగ్ చేస్తున్నాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో పవర్ ప్లేలోనే భారీ పరుగులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను వ్యక్తిగత రికార్డులను కూడా లెక్క చేయడం లేదు. హాఫ్ సెంచరీ ముంగిట ఔటవుతున్నా.. డోంట్ కేర్ అన్నట్లు బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

ఈ టోర్నీలో రోహిత్ (0, 131, 86, 48, 46, 87, 40, 61, 47) 10 మ్యాచ్‌ల్లో 546 పరుగులు చేశాడు. సున్నాతో మొదలుపెట్టిన రోహిత్.. నాలుగు హాఫ్ సెంచరీలు, రెండు శతకాలను చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 711 రన్స్ చేశాడు. ఇందులో 3 సెంచరీలతో పాటు 5 హాఫ్ సెంచరీలున్నాయి.

టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చిన రోల్‌ను పోషిస్తూ.. కోహ్లీ జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Saturday, November 18, 2023, 18:06 [IST]
Other articles published on Nov 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+