Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మనీష్ పాండేకు ఆ సత్తా లేదు.. ఈ తరహా ఆటతోనే టీమిండియాలో చోటు కోల్పోయాడు: ఆశిష్ నెహ్రా

Ashish Nehra says That’s why Manish Pandey failed to cement his place in the Indian team

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండేపై టీమిండియా దిగ్గజ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాండే ఆడిన తీరు ఏ మాత్రం బాలేదన్నాడు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడని, ఈ తరహా ఆట తీరుతోనే టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడన్నాడు. ఇక నిర్లక్ష్యపు బ్యాటింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ ఓటమికి మనీష్ పాండే కారణమని, అతని స్ట్రైక్‌రేట్ చాలా దారుణంగా ఉందని మాజీ క్రికెటర్లు విమర్శించారు.

టెయిలెండర్స్‌లా..

టెయిలెండర్స్‌లా..

ఈ క్రమంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడిన నెహ్రా.. పాండే‌కు ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం లేదన్నాడు. 'ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన సమయంలో వారి ఏకైక లెగ్ స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించాడు. షబాజ్ అహ్మద్‌కు బంతినిచ్చి ఫలితాన్ని రాబట్టాడు. అయితే ఈ ఓవర్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, అబ్దుల్ సమాద్ ఔటైన విధానం దారుణం. వారి ఆట స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లా లేదు. చివర్లో బ్యాటింగ్ వచ్చే టెయిలండర్స్‌లా ఈ ముగ్గురి షాట్ సెలెక్షన్ ఉంది. ముఖ్యంగా మనీష్ పాండే ఔటైన తీరు విస్మయపరిచింది.

 ఒత్తిడిని అధిగమించే..

ఒత్తిడిని అధిగమించే..

మూవింగ్ బాల్స్ ఆడేందుకు 9, 10, 11 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాళ్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. వారు మిడ్ వికెట్, లాంగాన్ మీదుగా షాట్స్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. కానీ మంచి ఫామ్‌లో ఉండి, ఒత్తిడి ఎలా ఆడాలో తెలిసిన ఆటగాళ్లు కూడా టెయిలండర్స్‌లా ఔటవ్వడం దారుణం. వారికి మిడాఫ్, కవర్స్ మీదుగా షాట్స్ ఆడే అవకాశం ఉంది. ఈ తరహా ఆట తీరుతోనే మనీష్ పాండే టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. అతని సహచర ఆటగాళ్లయిన హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తనను మించిపోయారు. ఎందుకంటే వీరు మనీష్ పాండే కన్నా గొప్పగా కఠిన పరిస్థితులను బాగా అందిపుచ్చుకుంటారు. జట్టుకు విజయాలనందిస్తారు.'అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

మనీష్ ఆడిన ప్రతీసారి..

మనీష్ ఆడిన ప్రతీసారి..

అయితే మనీశ్‌ పాండే పరుగులు చేసిన చాలాసార్లు సన్‌రైజర్స్‌కు ఓటమితప్పట్లేదు. మనీష్ పాండే.. 30 బంతులకు పైగా ఆడిన మ్యాచులలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దాదాపు ఓడిపోయింది. 2018 నుంచి మనీష్ 30 బంతులకు పైగా 14 మ్యాచులు ఆడగా.. 11 సార్లు సన్‌రైజర్స్‌ ఓటమిపాలైంది. గత నాలుగు సీజన్లుగా మనీష్ ఆట సన్‌రైజర్స్‌కు ఏమాత్రం కలిసిరావడం లేదు. బెంగళూరుపై 39 బంతుల్లో 38 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. బౌండరీల ద్వారానే అతడు 20 రన్స్ చేశాడు. అంటే.. మ్యాచులో మనీష్ డాట్ బాల్స్ ఎక్కువగా ఆడాడు. కోల్‌కతాపై కూడా నెమ్మదిగా ఆడి జట్టు ఓటమికి కారణమయ్యాడు.

 ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ

ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్ చేసింది. గ్లేన్ మ్యాక్స్ వెల్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, షబాజ్ నదీమ్, నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు. అపంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 రన్స్‌కే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 54), మనీశ్ పాండే(39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. కైల్ జేమీసన్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, April 15, 2021, 20:22 [IST]
Other articles published on Apr 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+