
పృథ్వీషాను ఆడించాల్సింది..
'టెక్నిక్ పరంగా చెబితే ఏ ఆటగాడికైనా సర్దుకుపోవడం కొద్దిగా కష్టమే. అడిలైడ్ టెస్టు ఆడుతున్నప్పుడు అతనికి 30-40 టెస్టుల అనుభవమేమీ లేదు. మనం మాట్లాడుతున్నది ఒక యువకుడి గురించి. కేవలం ఆ మ్యాచ్ ఆధారంగా పక్కన పెట్టడం సరికాదు. గతేడాది ఐపీఎల్‌లోనూ అతడిని జట్టులోంచి తప్పించాల్సింది కాదు. భారత్ ఆ సిరీస్ గెలిచినా ఒక్క మ్యాచ్ వైఫల్యంతో అతన్ని బెంచ్‌కు పరిమితం చేయాల్సింది కాదు. గతేడాది ఐపీఎల్‌లో కూడా అతన్ని జట్టు నుంచి తప్పించాల్సింది కాదు. అతను విఫలమైనా కొన్ని మ్యాచ్‌లు అద్భుతంగా ఆడాడు. టీ20 విషయానికొస్తే.. రహానే కన్నా ఎక్కువ పరుగులు చేసే యువకుడికే నేను మద్దతిస్తాను. అజింక్య మంచి ఆటగాడు కాదని నేను అనడం లేదు. టీ20ల్లో షా, పంత్, స్టాయినిస్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు అవసరం' అని నెహ్రా పేర్కొన్నాడు.

బ్యాట్, ప్యాడ్ మధ్య గ్యాప్..
అడిలైడ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన షా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 పరుగులకు అదే రీతీలో ఔటయ్యాడు. బంతి ఇన్‌స్వింగ్ అయి లోపలికి దూసుకు వస్తున్నప్పుడు అతడి బ్యాటు, ప్యాడ్ల మధ్య ఎక్కువ దూరం ఉంటోంది. దీనివల్ల బంతి ఆ మధ్యలోంచి వెళ్లి వికెట్లను గిరాటేసేది. దాంతో షా బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా పృథ్వీ షాను పక్కనపెట్టింది. అనంతరం భారత్‌కు వచ్చిన షా తన బ్యాటింగ్ లోపాన్ని సరిచేసుకున్నాడు.

దుమ్మురేపిన షా..
విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 800కు పైగా పరుగులు చేశాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచుల్లో 38.50 సగటు, 166 స్ట్రైక్‌రేట్‌తో 308 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు బాదాడు. సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే 6 బంతులకు 6 ఫోర్లు కొట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఇంగ్లండ్ టూర్‌కు నో చాన్స్..
దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్‌లో కూడా చెలరేగడంతో పృథ్వీ షాకు మళ్లీ టీమిండియాలో చోటు దక్కుతుందని అంతా భావించినా.. అతనికి సెలక్టర్లు మొండిచెయ్యే చూపించారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఎంపిక చేసిన జట్టులో సెలెక్టర్లు పృథ్వీ షాను పరిశీలనలోకి తీసుకోలేదు. చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన బృందాన్ని శుక్రవారం ఎంపిక చేసింది. ఈ జట్టు ఎంపికలో సెలెక్టర్లు సంచలనాలకు చోటివ్వలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన భారత జట్టునే ఈసారీ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై మాత్రం వేటు వేశారు.


Click it and Unblock the Notifications












