వీడు పెద్ద ముదురు.. చెప్పేవన్నీ అబద్దాలే.. హార్దిక్ ప్రశంసలపై నెహ్రా ఫన్నీ రియాక్షన్! (వీడియో)

అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ విజేతగా నయా టీమ్ గుజరాత్ టైటాన్స్ నిలిచింది. లక్ష గొంతుకలు వందేమాతరం అని నినదించిన వేళ.. కోట్ల హృదయాలు జయహో అని జ్వలించిన సమయాన.. ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూసిన తరుణాన.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగిన ముగింపు వేడుకలతో సెండాఫ్ చెబుతూ.. గుజరాత్ మెగా ట్రోఫీతో సగర్వంగా మెరిసింది. లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలిసారే కప్ కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చడంతో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఫస్ట్ ఇయర్‌లోనే సిక్స్ కొట్టాం..
అయితే ఈ విజయానంతరం గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా.. తమ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతో కలిసి సరదాగా చిట్ చాట్ చేశాడు. హార్దిక్ పాండ్యా ముందుగా మాట్లాడుతూ.. తమ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. 'మేం అరంగేట్ర సీజన్‌లోనే సిక్స్ కొట్టాం. మేం చాంపియన్స్‌గా నిలిచాం. మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. చాలా మంది మ్యా బ్యాటింగ్, బౌలింగ్ బలంగా లేవని చాలా రకాల కామెంట్స్ చేశాడు. కానీ మేం టైటిల్ గెలిచాం. మాకు అంతా మంచే జరిగింది.'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

ఆటగాళ్ల ప్రదర్శన సూపర్..
ఇక నెహ్రా మాట్లాడుతూ గెలిచామనే ఫీలింగ్ అద్భుతంగా ఉందన్నాడు. 'టైటిల్ గెలిచినదానికంటే మా జట్టు ఆటతీరు నాకు ఎక్కువ సంతోషాన్నిస్తోంది. హార్దిక్ సారథ్యంలో కుర్రాళ్లు అదరగొట్టారు.'అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే హార్దిక్ మాట్లాడుతూ.. గుజరాత్ సక్సెస్ క్రెడిట్ నెహ్రాదేనని తెలిపాడు. 'ప్రాక్టీస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే నెహ్రా.. ఆటగాళ్లను ఎక్కువసేపు నెట్స్‌లో గడిపేలా చేసేవాడు. బ్యాటింగ్ సెషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్లీ మరో 20 నిమిషాల పాటు సాధన చేయించేవాడు. ఆ విధమైన కోచింగ్‌తో మమ్మల్ని మరింత దృఢంగా తయారు చేశాడు. మా సక్సెస్ క్రెడిట్ మొత్తం నెహ్రాదే'అంటూ హార్దిక్ ఆకాశానికెత్తాడు.

అన్నీ అబద్దాలే..
ఈ వ్యాఖ్యలపై నెహ్రా విభిన్నంగా స్పందించాడు. హార్దిక్ చాలా ముదురని, అతను చెప్పేవన్నీ అబద్దాలేనని పేర్కొన్నాడు. టీమ్ సక్సెస్ క్రెడిట్ అందరిదనీ, తనొక్కడిది కాదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ చిట్ చాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, 'ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్' హార్దిక్ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications