ఐపీఎల్ 2021 వేలంలో అధిక ధర పలికేది అతనే: ఆశిష్ నెహ్రా

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ మినీ వేలంలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అత్యధిక ధర పలుకుతాడని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తెలిపాడు. ఈ స్పిన్ ఆల్‌రౌండర్ కోసం 8 జట్లు పోటీపడతాయన్నాడు. అటు బ్యాట్ ఇటు బంతితో సమర్థవంతంగా రాణించే షకీబ్ అల్ హసన్ జట్టులో ఉంటే టీమ్ సమతూకంగా ఉంటుందన్నాడు. స్టార్ స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్టెడ్ ఆక్షన్ స్పెషల్' షోలో మాట్లాడిన ఈ మాజీ పేసర్.. గురువారం చెన్నై వేదికగా జరగనున్న వేలంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

షకీబ్‌కు భారీ ధర..
'స్టార్ ఆటగాళ్లతో మళ్లీ ఐపీఎల్ వేలం జరుగుతుంది. కానీ ఈ సారి నా అంచనా ప్రకారం బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఆటగాడిగా నిలవనున్నాడు. అతను ఏ ఐపీఎల్ జట్టు లేక మరేదైనా టీ20 టీమ్‌లో చేరినా ఆ జట్టుకు బ్యాలెన్స్ వస్తుంది.'అని నెహ్రా తెలిపాడు. ఇక ఐసీసీ నిషేధం కారణంగా షకీబ్ అల్ హసన్.. ఐపీఎల్ 2020 సీజన్‌కు దూరమైన విషయం తెలిసిందే. బుకీలు సంప్రదించారనే విషయాన్ని ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌కు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ బంగ్లాదేశ్ క్రికెటర్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. ఐపీఎల్ 2020 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2018 మెగా వేలంలో హైదరాబాద్ అతన్ని రూ.2 కోట్లకు తీసుకుంది.

చైన్నై ఆ ఇద్దర్ని తీసుకోవాలి..
ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీతో పాటు షకీబ్ అల్ హసన్‌ను తీసుకోవాలని నెహ్రా సూచించాడు. 'షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీని తీసుకోవడం చెన్నై ముందున్న మంచి ఆప్షన్స్. బ్యాటింగ్, బౌలింగ్ చేయగలిగే ఆటగాళ్లంటే ధోనీకి ఇష్టం. ఐపీఎల్ భారత్‌లో జరిగినా లేక యూఏఈలో జరిగినా ఈ ఇద్దరు ఆటగాళ్లు వారికి ఉన్న అనుభవంతో రాణించగలరు.'అని చెప్పుకొచ్చాడు.

జాదవ్ ఒక్కడినే..
ఇక చెన్నై విడుదల చేసిన ఆటగాళ్లలో కేదార్ జాదవ్ ఒక్కడిని మళ్లీ తీసుకేనే అవకాశం ఉందని నెహ్రా తెలిపాడు. రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఎవరినైనా తీసుకుంటారా? అనే ప్రశ్నకు సమాధానంగా నెహ్రా ఇలా చెప్పుకొచ్చాడు. 'రిటైన్ ఆటగాళ్లను తీసుకోవడం కష్టమే. కానీ కేదార్ జాదవ్ ఒక్కడిని తక్కువ ధరకు తీసుకునే అవకాశం ఉంది. అతన్ని గతంలో రూ. 8 కోట్లకు తీసుకున్నారనుకుంటా. విడుదల చేసిన ఆటగాళ్లలో జాదవ్‌ను మినహా మరే ఆటగాడిని తీసుకునే అవకాశం లేదు'అని నెహ్రా తెలిపాడు.

ఆఫ్ స్పిన్నర్ తీసుకోవాలి..
ఇక ఇదే షోలో పాల్గొన్న ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. అలాగే మరింత మందిని రిలీజ్ చేయాల్సిందన్నాడు. 'సీఎస్‌కేకు ఆఫ్ స్పిన్నర్ కావాలి. ఎందుకంటే ఆ జట్టులో ఆఫ్ స్పిన్నర్ కొరత ఉంది. ఉన్న ఒక్క హర్భజన్ సింగ్‌ను కూడా ఆ జట్టు రిలీజ్ చేసింది. మొయిన్ అలీ లేదా జలజ్ సక్సెనా, కృష్ణప్ప గౌతమ్ కోసం ఆ జట్టు పోటీ పడాలి. గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఉన్నా తీసుకునే చాన్స్ లేదు. ఓవర్‌సీస్ స్లాట్ ఒక్కటే ఉంది. 'అని చోప్రా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications