Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'గిల్‌, షా వద్దు.. ఓపెనర్‌గా రాహుల్‌ను ఆడించాలి‌'

Ashish Nehra picks KL Rahul to open with Mayank Agarwal in first Test

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో ఓపెనింగ్ జోడీపై టీమిండియా ప్రయోగాలు చేయనుంది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ టెస్టు కోసం ఆదివారం వరకూ భారత్‌లోనే ఉండిపోడంతో.. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్టు (డే/నైట్)లో అతను ఆడే అవకాశం లేదు. దాంతో కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్ అగర్వాల్‌కి జోడీగా ఎవరిని ఓపెనర్‌గా పంపాలి? అని టీమిండియా మేనేజ్‌మెంట్ తర్జనభర్జన పడుతోంది. అయితే యువ ఓపెనర్లు పృథ్వీ షా, శుభమన్ గిల్‌లలో ఒకరి అవకాశం దక్కనుంది.

నెహ్రా కీలక సూచన

నెహ్రా కీలక సూచన

రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో పృథ్వీ షా, శుభమన్ గిల్ ఆశించిన మేర రాణించలేకపోయారు. పృథ్వీ షా పూర్తిగా తేలిపోగా.. శుభమన్ గిల్ మాత్రం ఒక ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. దాంతో మయాంక్ అగర్వాల్‌కి జోడీగా ఎవరిని పంపాలనే విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఓపెనింగ్ జోడీపై క్లారిటీ రాకపోవడంతో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఓ కీలక సూచన చేశాడు. గతంలో టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన కేఎల్ రాహుల్‌.. అగర్వాల్‌కి మంచి జోడీ అని సూచించాడు.

రాహుల్‌తో ఓపెనింగ్ చేయించాలి

రాహుల్‌తో ఓపెనింగ్ చేయించాలి

'ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ల గురించి తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. మయాంక్ అగర్వాల్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించేది ఎవరని చర్చిస్తున్నారు. అయితే భారత్‌ ఓపెనింగ్‌ బలహీనంగా ఉందని చెప్పను. కానీ మయాంక్‌తో కలిసి శుభమన్ గిల్ లేదా పృథ్వీ షా కాకుండా కేఎల్‌ రాహుల్‌తో ఓపెనింగ్ చేయించాలి. అతడు ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగులు చేస్తే టీమిండియా బలహీనత బలంగా మారుతుంది. మయాంక్ కూడా గత పర్యటనలో కీలక పరుగులు సాధించాడు. అంతేగాక మయాంక్‌-కేఎల్ రాహుల్ మధ్య సమన్వయం గొప్పగా ఉంటుంది. టెస్టుల్లో రాహుల్ ఆడాలని నేను కోరుకుంటున్నా' అని ఆశిష్ నెహ్రా అన్నాడు.

రాహుల్ తప్పక ఉండాలి

రాహుల్ తప్పక ఉండాలి

గత ఏడాదిన్నరలో కేఎల్ రాహుల్‌కు టెస్టుల్లో అవకాశం ఇవ్వలేదని, కానీ ఇప్పుడు అతడు జట్టులో తప్పక ఉండాలని నెహ్రా తెలిపాడు. కర్ణాటకకి చెందిన మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ సుదీర్ఘకాలం దేశవాళీలో ఓపెనర్లుగా ఆడారు. అలానే ఐపీఎల్‌ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ తరఫున మయాంక్, కేఎల్ రాహుల్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే.‌ ఓపెనర్లుగా ఆడుతున్న ఈ ఇద్దరూ మైదానంలోనే కాదు వెలుపల కూడా మంచి ఫ్రెండ్స్. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్‌ 17న అడిలైడ్ వేదికగా భారత్‌×ఆస్ట్రేలియా మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.

రాత్రి వేళ మమల్ని చదవడం కష్టమే: కుల్‌దీప్‌

Story first published: Monday, December 14, 2020, 14:14 [IST]
Other articles published on Dec 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+