Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాంపరింగ్ మంచిది కాదు.. ఉమ్మికి మించింది లేదు: భారత స్టార్ బౌలర్లు

Ashish Nehra, Harbhajan Singh feel Saliva is must and vaseline is no replacement

ముంబై: కరోనా మీద మన్నువడ.. ఎక్కడి గత్తర పాడైంది. ఈ రోగం పాడుగాను.! ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలమైందంటే.. దీని దెబ్బకు క్రికెట్‌ స్వరూపమే మారే పరిస్థితి వచ్చింది. ఈ అంటు రోగం పుణ్యమా జరగాల్సిన టోర్నీలు రద్దవ్వగా.. ఎప్పుడు మొదలవుతాయో తెలియని గందరగోళం నెలకొంది. ఒకవేళ మొదలైనా ఆటలో సహజంగానే మార్పులు రానున్నాయి.

ఉమ్మిపై విస్తృత చర్చ..

ఉమ్మిపై విస్తృత చర్చ..

వికెట్ తీసిన క్షణంలో సహచరుల మధ్య కౌగిలింతలు, అభినందనలు కొంత కాలం కనిపించకపోవచ్చు. బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కోసం ఉమ్ము (స‌లైవా), చెమట ఉపయోగించడం క్రికెట్లో సర్వసాధారణం. అయితే ఈ గత్తర పుణ్యమా దీనిపై నిషేధం విధించవచ్చు. ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో ఈ చర్చనే విస్తృతంగా జరుగుతోంది. అదే..కరోనా వైరస్‌ దరిమిలా ఇకపై బంతికి మెరుపు తెచ్చేందుకు బౌలర్లు ఉమ్మి ఉపయోగించడం ప్రమాదకరమని. అలా అయితే, ప్రత్యామ్నాయం ఏమిటన్న వాదనా తెరపైకి వచ్చింది.

 ఉమ్మిపూయడమే ఉత్తమ మార్గం..

ఉమ్మిపూయడమే ఉత్తమ మార్గం..

ఈ నేపథ్యంలో బంతి మెరుపునకు ఉమ్మి కాకుండా ఆమోదయోగ్యమైన కృత్రిమ పదార్థాలు, ఇతర వస్తువులను అనుమతిస్తే ఎలా ఉంటుందని ఐసీసీ ఆలోచిస్తోంది. కానీ, భారత వెటరన్‌ బౌలర్లు ఆశిష్‌ నెహ్రా, హర్భజన్‌ సింగ్‌ మాత్రం బంతికి మెరుపు తెచ్చేందుకు ఉమ్మి పూయడమే ఉత్తమ మార్గమని అంటున్నారు. ‘ఉమ్మి లేదా చెమటతో బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. ఈ రెండింటి తర్వాతే వాస్‌లైన్‌' అని నెహ్రా అభిప్రాయపడ్డాడు.

బాలిల్ మూతను కూడా ఉపయోగిస్తారు..

బాలిల్ మూతను కూడా ఉపయోగిస్తారు..

ఇక..చక్కెర కలిసి ఉన్నందున ఉమ్మి కంటే చూయింగ్‌ గమ్‌ తడి బంతి మెరుపునకు ఎక్కువగా తోడ్పడుతుందని హర్భజన్‌ చెప్పాడు. ‘బాల్‌ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేస్తే బౌలర్లు బాటిల్‌ మూతను ఉపయోగిస్తారు. దాంతో ఐదో ఓవర్‌ నుంచే బంతి రివర్స్‌ స్వింగ్‌ అవుతుంది. అది న్యాయమేనా? లేదంటే..ఇక, అంపైర్‌ వచ్చి బంతికి మెరుపు తెచ్చేందుకు బాహ్య పరికరాలు ఉపయోగించవచ్చని చెబుతాడు. ఇదీ సరైన పద్ధతి కాదేమో. ఏదేమైనా బంతి స్వింగ్‌ అయ్యేందుకు ఉమ్మి వాడక పోవడమన్నది క్రికెట్‌కు మంచిది కాదు' అని భజ్జీ అన్నాడు.

 చట్టబద్దం చేసే యోచనలో ఐసీసీ

చట్టబద్దం చేసే యోచనలో ఐసీసీ

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రస్తుతం బంతిని స్వింగ్‌కు అనుకూలంగా మార్చడానికి ఉమ్మును ఉపయోగించడం ప్రమాదం కావడంతో.. అందుకోసం ఉప్పు కాగితం లాంటివి లేదా లాలాజలం ఉపయోగపడే ద్రావణం లాంటివి అనుమతించవచ్చని తెలుస్తోంది. 'పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉపయోగించే తెల్ల బంతితో వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ.. టెస్టుల్లో మాత్రం దీర్ఘ కాలం ఉమ్ము వాడకుండా బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కష్టం. ఇందుకు పరిష్కారమేంటన్నది ఆలోచిస్తున్నాం' అని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Story first published: Sunday, April 26, 2020, 10:32 [IST]
Other articles published on Apr 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+