Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashish Nehra: ఇంత మంచి బౌలర్‌ను దాచిపెట్టుకున్నారేంది వ్యా?

Ashish Nehra Hails Umran Malik, Wonders ‘Why SRH Held Him Back’

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. ఎంతో నైపుణ్యం ఉన్న ఈ జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టుకుందని నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. వికెట్లేమి తీయకమైన ఫాస్టెస్ట్ బాల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో ప్రధాన పేసర్‌ టి.నటరాజన్‌ కరోనా బారిన పడటంతో ఆ స్థానాన్నీ భర్తీ చేస్తూ సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ యువపేసర్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే కోల్‌కతాపై తొలి మ్యాచ్‌ ఆడిన ఉమ్రాన్‌.. ఈ సీజన్‌లో అత్యధిక వేగంగా బౌలింగ్‌ చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గంటకు 150.06 కి.మీ వేగంతో బంతి సంధించి క్రికెట్‌ విశ్లేషకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఉమ్రాన్ బౌలింగ్‌కు ఫిదా అయిన ఆశిష్ నెహ్రా.. సరైన బౌలర్లు లేక ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఉమ్రాన్‌ను ముందే ఎందుకు ఆడించలేదని ప్రశ్నించాడు.

Ashish Nehra Hails Umran Malik, Wonders ‘Why SRH Held Him Back’

'సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌ ముందే ఉమ్రాన్‌ను ఆడించకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. సెకండాఫ్‌లో కరోనా బారిన పడిన నటరాజన్‌కు రీప్లేస్‌గా అతన్ని జట్టులోకి తీసుకొచ్చారు. టీమ్ వరుస ఓటములతో ఇబ్బందులు పడుతున్నా అతన్ని ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు. అతని బౌలింగ్‌లో నైపుణ్యం ఉంది. అది మాత్రమే కాకుండా పేస్‌ బౌలింగ్‌కు సరిపడా యాక్షన్‌ ఉంది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌ నుంచి వచ్చినందున అతడెంతో దృఢంగా ఉన్నాడు. తన చేతి నుంచి బంతి దూసుకెళ్లే విధానం కూడా ఆకట్టుకుంది. భవిష్యత్‌లో అతడెంత ముందుకు వెళతాడో కాలమే నిర్ణయిస్తుంది. అతనికి అపారమైన ప్రతిభ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఉమ్రాన్ బౌలింగ్ చూస్తే ముచ్చటేసింది' అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

కేకేఆర్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఓవర్‌‌లో మూడో బంతిని ఉమ్రాన్‌ గంటకు 150.06 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. దాంతో భారత్‌ తరపున ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా ఉమ్రాన్‌ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో ఉమ్రాన్ తర్వాత మహ్మద్‌ సిరాజ్‌- ఆర్‌సీబీ (గంటకు 147.68కిలోమీటర్లు, 147.67కిలోమీటర్లు), ఖలీల్‌ అహ్మద్‌( గంటకు 147.38కిమీ) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఉమ్రాన్ వేసిన ఆ నాలుగో ఓవర్‌లో వరుసగా గంటకు 145, 141.5, 150, 147, 143, 141 కిలోమీటర్ల వేగంతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అతను వేసిన తొలి రెండు ఓవర్లలో 10 బంతులు 141 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో విసిరానవే కావడం గమనార్హం.

Story first published: Monday, October 4, 2021, 14:22 [IST]
Other articles published on Oct 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+