Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: ఓహో బుడ్డోడి‌ని ఔట్ చేసింది ఆశిష్ నెహ్రానా..?(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టినేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. ప్రత్యర్థి.. బౌలర్ ఎవరా? అనేది పట్టించుకోకుండా విరుచుకుపడుతున్నాడు. వరల్డ్ బెస్ట్ బౌలర్లు అయిన జస్‌ప్రీత్ బుమ్రా, జోష్ హేజెల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడా బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్‌ పేసర్ సిరాజ్‌కు కూడా అదే తరహా ట్రీట్‌మెంట్ ఇచ్చాడు.

శనివారం జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) క్రీజులో ఉన్నంత సేపు గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. ముఖ్యంగా సిరాజ్, వైభవ్ సూర్యవంశీ మధ్య సైలెంట్ వార్ నడిచింది. సిరాజ్ బౌలింగ్‌లో వైభవ్ భారీ షాట్స్ ఆడగా.. కళ్లు చెదిరే యార్కర్లతో బుడ్డోడిని డీఎస్పీ సాబ్ ఇబ్బంది పెట్టాడు. గంటకు 146.6 కిలోమీటర్ల వేగంతో సిరాజ్ సంధించిన ఓ యార్కర్.. వైభవ్ సూర్యవంశీ పాదానికి బలంగా తాకింది.

Ashish Nehra dugout signal led to Vaibhav Sooryavanshi s dismissal In RR vs GT IPL 2026 Clash Video

ఈ గాయం ధాటికి 15 ఏళ్ల కుర్రాడు క్రీజులో కుప్పకూలాడు. ఆ తర్వాత మరింత కసితో చెలరేగిన బుడ్డోడు సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీలు బాదాడు. చివరకు సిరాజ్ బౌన్సర్‌కు పుల్ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో వైభవ్‌పై కన్నెర్ర చేసిన సిరాజ్ గట్టిగా అరుస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

అయితే వైభవ్ సూర్యవంశీ వికెట్ వెనుక గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఉన్నాడు. వైభవ్ ఫుట్‌వర్క్, బ్యాటింగ్ తీరును గమనించిన నెహ్రా.. బౌన్సర్ సంధించాలని డగౌట్ నుంచి సిరాజ్‌కు సైగలు చేశాడు. తన తల చూపిస్తూ మరీ చెప్పాడు. నెహ్రా చెప్పినట్లుగానే సిరాజ్ బౌన్సర్ వేయగా.. పుల్ షాట్ ఆడబోయి వైభవ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆశిష్ నెహ్రా సైగలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆశిష్ నెహ్రా ఇలా టిప్స్ అందించడం ఇదే తొలిసారి కాదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ ఫుట్‌బాల్ కోచ్ తరహాలో బౌండరీ లైన్‌పై నిలబడి జట్టును నడిపించేవాడు. ఫీల్డ్, బౌలింగ్ మార్పులు అన్నీ తానే సూచించేవాడు. ఇప్పుడు గిల్‌కు కూడా అదే తరహాలో సూచనలు చేస్తున్నాడు. వైభవ్ వికెట్‌తో ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Story first published: Sunday, May 10, 2026, 16:13 [IST]
Other articles published on May 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+