Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: టీమిండియా మూడో పేసర్‌గా అతనే సరైనోడు: ఆశిష్ నెహ్రా

Ashish Nehra Assesses Indias Pace Bowling Options For South Africa Tests

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా మూడో పేసర్‌గా మహమ్మద్ సిరాజ్ సరైనోడని దిగ్గజ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ప్రధాన పేసర్లుగా జట్టు ఉండటం ఖాయమని, దీంతో మూడో పేసర్‌గా సిరాజ్‌ను తీసుకునే అవకాశాలున్నాయన్నాడు. సౌతాఫ్రికా పర్యటనకు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఎంపికైనప్పటికీ.. అతను ఫామ్‌లో లేడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో తన చివరి రెండు టెస్ట్‌ల్లో విఫలమయ్యాడు. దాంతోనే మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ అయిన ఇషాంత్‌‌‌ను కాదని సిరాజ్‌ను తీసుకునే అవకాశం ఉందన్నాడు. అయితే ఇది టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నాడు. పేస్ ఆల్‌రౌండర్ కావాలనుకుంటే మాత్రం శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవచ్చని నెహ్రా సూచించాడు.

పటిష్టంగా బౌలింగ్ దళం..

పటిష్టంగా బౌలింగ్ దళం..

'భారత జట్టుకు కావాల్సిన బౌలింగ్ దళం ఉంది. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా పేస్‌ విభాగం పటిష్ఠంగా తయారైంది. అలాగే ఉమేశ్‌ యాదవ్‌ లాంటి అనుభజ్ఞుడు జట్టులో ఉన్నాడు. జట్టుకు ఇలాంటి నాణ్యమైన ఆటగాళ్లను అందించిన క్రెడిట్ ఐపీఎల్‌కు దక్కుతుంది. ఈ ధనాధన్ లీగ్‌కు ధన్యవాదాలు చెప్పాలి. ఆటగాళ్లంతా ఇప్పుడెంతో ఫిట్‌‌గా ఉన్నారు. రిజర్వ్ బెంచ్ కూడా బలంగా ఉంది. ఇంతకుముందు జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లు మాత్రమే ఉండేవాళ్లు. ఒకవేళ ఎవరైనా గాయాలబారిన పడితే ఇక జట్టు డీలా పడిపోయేది.

బలమైన బ్యాకప్..

బలమైన బ్యాకప్..

అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. ముఖ్యంగా టెస్టుల్లో బలమైన బ్యాకప్‌ కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం' అని నెహ్రా చెప్పుకొచ్చాడు. ఇక నయా ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌పై స్పందించిన మాజీ పేసర్‌.. అతన్ని నాలుగో ఆప్షన్‌గా చూడాలన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఉండే పరిస్థితుల ఆధారంగా బ్యాటింగ్‌లోనూ రాణించే శార్దూల్‌ను అవసరమైతే తుది జట్టులో ఎంపిక చేయాలని సూచించాడు. టీమిండియా ఐదుగురు బౌలర్ల వ్యూహానికి కట్టుబడితే బుమ్రా, షమీ, సిరాజ్‌లతో పాటు శార్దూల్ కూడా ఆడుతాడన్నాడు. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్ బరిలోకి దిగడం ఖాయమన్నాడు.

 లంబూతో కోహ్లీ ట్రెయినింగ్..

లంబూతో కోహ్లీ ట్రెయినింగ్..

సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ వేగం పెంచాడు. బుధవారం జరిగిన నెట్ సెషన్‌‌లో విరాట్.. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. లంబూ వేసిన రైజింగ్ బాల్స్‌ను ఎదుర్కొన్నాడు. సౌతాఫ్రికా టీమ్‌లోని రబాడ, ఎంగిడి, ఒలివీర్ వంటి టాల్ పేసర్లను పక్కాగా ఎదుర్కొనేందుకు కోహ్లీ.. లంబూ సపోర్ట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే టైమ్‌లో వరల్డ్ బెస్ట్ బ్యాటర్ విరాట్‌కు బౌలింగ్ చేయడం ద్వారా ఇషాంత్‌లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగే చాన్సుంది. పేలవ ఫామ్ కారణంగా అతను తుది జట్టులో ఉండటంపై అనుమానం నెలకొన్నా.. నెట్ సెషన్ తర్వాత లంబూ విషయంలో కోహ్లీ ఆలోచన మారుతుందేమో చూడాలి.

 గబ్బా టెస్ట్‌తో..

గబ్బా టెస్ట్‌తో..

డిసెంబర్ 26-30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. జనవరి 3-7 వరకు జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్, జనవరి 11-15 వరకు కేప్‌టౌన్‌లో మూడో టెస్ట్ జరగనుంది. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ముందు షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉండగా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ) ప్రకటించింది.

Story first published: Friday, December 24, 2021, 17:13 [IST]
Other articles published on Dec 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+