For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, రోహిత్ కన్నా సూర్యకుమార్ యాదవ్ తక్కువేమి కాదు!

Ashish Nehra and Mohammad Kaif lauds Suryakumar Yadav for grabbing chances with both hands

న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనలో దుమ్మురేపుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో నిలకడైన ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య.. ఆదివారం జరిగిన తొలి టీ20లో హాఫ్ సెంచరీతో మెరిసాడు. దాంతో భారత్ 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసింది.

ఇక సూర్య సూపర్ బ్యాటింగ్‌పై అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు కొనియాడుతున్నారు. భారత జట్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కన్నా సూర్యకుమార్ యాదవ్ తక్కువేమి కాదని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రశంసించగా.. తొలి బంతినే సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌లా ఆత్మవిశ్వాసంతో ఆడుతాడని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కొనియాడాడు.

ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ సూర్య..

ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ సూర్య..

'శ్రీలంక పర్యటనలో టీమిండియాకు ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. అయితే అతిపెద్ద సానుకూలంశం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్. గత రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను ఆడిన విధానం అద్భుతం. పెద్ద ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోయినప్పటికీ.. మిడిలార్డర్‌లో సూర్య ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడిలా రాణించాడు. ముంబై ఇండియన్స్ తరఫున అతను మూడు, నాలుగో స్థానంలో ఆడటం చూశాం. కానీ ఇక్కడ అతను ఇంకా కింది ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. కానీ అతను ఆడిన ఫోర్లు, తీసిన సింగిల్స్.. ఆ ఆత్విశ్వాసం నిజంగా అత్యద్బుతం. ప్రశంసించకుండా ఉండలేం.

వారికన్నా తక్కువేం కాదు..

వారికన్నా తక్కువేం కాదు..

ఇంత అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టులో చోటివ్వాల్సిందే. అతను జట్టులోని కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలకు ఏ మాత్రం తక్కువ కాదు. వారితో సమంగా రాణిస్తున్నాడు. ప్రతీ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు అలవాటుపడ్డాడు.'అని క్రిక్‌బజ్‌తో నెహ్రా చెప్పుకొచ్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో సూర్య 62 యావరేజ్‌తో 124 రన్స్ చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.

సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌లా..

సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌లా..

సూర్యకుమార్ యాదవ్ తొలి బంతినే సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌లా ఆడుతున్నాడని మహమ్మద్ కైఫ్ ప్రశంసించాడు. 'సూర్యకుమార్ యాదవ్ తన తొలి బంతిని సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌లా ఆడుతున్నాడు. ఎలాంటి ఆందోళన, సందేహాలు లేకుండా పూర్తి కంట్రోల్‌గా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. దేశవాళీ స్టార్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తుంటే చూడటం అద్భుతంగా ఉంటుంది.'అని కైఫ్ ట్వీట్ చేశాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ సైతం మ్యాచ్‌ అనంతరం సూర్యను కొనియాడాడు. తనపై ఒత్తిడి లేకుండా చేశాడని, అతని బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తామని తెలిపాడు.

గబ్బర్ సేన శుభారంభం..

గబ్బర్ సేన శుభారంభం..

ఆదివారం జరిగిన తొటి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50)హాఫ్ సెంచరీతో రాణించగా.. శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

అనంతరం శ్రీలంక 18.3 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. చరిత్ అసలంక(44), అవిష్కా ఫెర్నాండో(26) మినహా అంతా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్ (4/22) నాలుగు వికెట్లతో లంక పతనాన్నిశాసించగా.. దీపక్ చాహర్(2/24) రెండు, వరుణ్ చక్రవర్తీ(1/28), యుజ్వేంద్ర చాహల్(1/19), హార్దిక్ పాండ్యా(1/17), కృనాల్ పాండ్యా(1/16)తలో వికెట్ తీశారు.

Story first published: Monday, July 26, 2021, 15:43 [IST]
Other articles published on Jul 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+