Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్‌ సిరీస్: స్మిత్ డబుల్‌ సెంచరీ.. సచిన్ రికార్డు బద్దలు

Ashesh 2019: Steve Smith overtakes Sachin Tendulkar in illustrious list with 26th Test ton

మాంచెస్టర్‌: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి టెస్టులో రెండు శతకాలు.. రెండో టెస్టులో అర్ధ సెంచరీ చేసిన స్మిత్‌.. నాలుగో టెస్టులో ఇంగ్లీష్ బౌలర్లపై మళ్లీ విరుచుకుపడ్డాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో స్మిత్‌ (211) డబుల్‌ సెంచరీతో మెరిశాడు. దీంతో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.

సచిన్ రికార్డు బద్దలు:

సచిన్ రికార్డు బద్దలు:

టెస్ట్ ఫార్మాట్‌లో స్మిత్ 26వ సెంచరీ చేసాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో 26 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ను దాటి రెండో స్థానంలో నిలిచాడు. స్మిత్‌ 121 ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలు చేయగా.. సచిన్ 136 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌ ఉన్నాడు. 69 ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలు చేసాడు. సునిల్‌ గవాస్కర్‌ (144), మాథ్యూ హెడెన్‌ (145) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

కోహ్లీని దాటేశాడు:

కోహ్లీని దాటేశాడు:

ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నుంచి నంబర్‌ వన్‌ టెస్టు ర్యాంకను సొంతం చేసుకున్న స్మిత్‌.. టెస్టు సెంచరీల్లో కూడా కోహ్లీని అధిగమించాడు. ఇప్పటివరకూ కోహ్లీ 25 టెస్టు సెంచరీలు సాధిస్తే.. స్మిత్‌ 26వ టెస్టు సెంచరీలు చేసాడు. ఈ యాషెస్‌ సిరీస్‌-2019లో మూడో సెంచరీ కావడం విశేషం. సమకాలీన టెస్టు క్రికెట్‌లో స్మిత్‌-కోహ్లీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.

వరుసగా 8 సెంచరీలు:

వరుసగా 8 సెంచరీలు:

స్మిత్‌ తన పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. యాషెస్‌లో వరుసగా ఎనిమిది సార్లు 50+ స్కోరుని సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ యాషెస్‌లో చివరి 8 ఇన్నింగ్స్‌ల్లో 239, 76, 102*, 83, 144, 142, 92, 211 పరుగులు చేసాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. స్మిత్‌ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసింది.

బంగ్లాదేశ్‌తో టెస్ట్.. 15 ఏళ్ల టెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన రషీద్‌ ఖాన్‌

Story first published: Friday, September 6, 2019, 13:00 [IST]
Other articles published on Sep 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+