For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs ENG: శతక్కొట్టిన ట్రావిస్ హెడ్, స్మిత్.. భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా!

యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్(166 బంతుల్లో 24 ఫోర్లు, సిక్స్‌తో 163), కెప్టెన్ స్టీవ్ స్మిత్(205 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 129 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 124 ఓవర్లలో 7 వికెట్లకు 518 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 134 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/108) మూడు వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్(2/87) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్, జాకోబ్ బెతెల్ తలో వికెట్ తీసారు. 166/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఓవర్‌నైట్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, నైట్ వాచ్‌మన్ మైకేల్ నేసర్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్.. నేసర్‌తో కలిసి మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించాడు.

Ashes Steve Smith Travis Head Centuries Put Australia in Command on Day 3

నేసర్‌ను కార్స్ ఔట్ చేయగా.. కెరీర్‌లో లాస్ట్ టెస్ట్ ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా(17) ఫుల్‌టాస్ బాల్‌కు వెనుదిరిగాడు. డబుల్ సెంచరీ దిశగా సాగిన ట్రావిస్ హెడ్‌ను బెతెల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. స్టీవ్ స్మిత్ 166 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఉస్మాన్ ఖవాజా(17), అలెక్స్ క్యారీ(16), కామెరూన్ గ్రీన్(37) విఫలమవ్వగా..
బ్యూ వెబ్‌స్టర్(58 బంతుల్లో 4 ఫోర్లతో 42)తో కలిసి మరో వికెట్ పడకుండా స్మిత్ మూడో రోజు ఆటను ముగించాడు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(242 బంతుల్లో 15 ఫోర్లతో 160) భారీ శతకంతో చెలరేగగా.. హ్యారీ బ్రూక్(97 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 84) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైకేల్ నేజర్(4/60) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కామెరూన్ గ్రీన్, మార్నస్ లబుషేన్ చెరో వికెట్ తీసారు.

నాలుగో రోజు ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది. ఇంగ్లండ్ కూడా ధీటుగా బదులిస్తే ఈ మ్యాచ్ డ్రా అవుతుంది. లేదంటే ఆసీస్‌కు విజయవకాశాలు మెరుగవుతాయి.

Story first published: Tuesday, January 6, 2026, 15:40 [IST]
Other articles published on Jan 6, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+