Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes: బాక్సింగ్ డే టెస్ట్.. ఇంగ్లండ్‌దే గెలుపు!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత నాలుగో టెస్ట్‌లో గెలుపొందింది. మెల్‌బోర్న్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడించిన ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. 2010-11లో చివరిసారిగా ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ గెలుపొందింది.

175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు గెలుపొందింది. జాకోబ్ బెతెల్(46 బంతుల్లో 5 ఫోర్లతో 40), బెన్ డకెట్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 34), జాక్ క్రాలీ(48 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, జై రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు తీసారు.

Ashes England Beat Australia by 6 Wickets to Seal Historic Boxing Day Test Victory

అంతకుముందు 4/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(67 బంతుల్లో 4 ఫోర్లతో 46), స్టీవ్ స్మిత్(24 నాటౌట్), కామెరూన్ గ్రీన్(19) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(4/34) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్(3/24) మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్‌కు(2/44) రెండు వికెట్లు దక్కగా.. గస్ అట్కిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. మైఖెల్ నెసర్(35), ఉస్మాన్ ఖవాజా(29), అలెక్స్ క్యారీ(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(5/45) ఐదు వికెట్లతో చెలరేగగా.. గస్ అట్కిన్సన్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్‌కు చెరో వికెట్ దక్కింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 29.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్(41), బెన్ స్టోక్స్(16), గస్ అట్కిన్సన్(28) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జాక్ క్రాలీ(5), బెన్ డకెట్(2), జాకోబ్ బెతెల్(1), జో రూట్(0), జేమీ స్మిత్(2), విల్ జాక్స్(5), బ్రైడన్ కార్స్(4) తీవ్రంగా నిరాశపర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైఖెల్ నెసర్(4/45) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్(3/30) మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, December 27, 2025, 12:40 [IST]
Other articles published on Dec 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+