Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia vs England: నిప్పులు చెరిగిన బౌలర్లు.. ఒకే రోజు 20 వికెట్లు!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో బౌలర్లు నిప్పులు చెరిగారు. శుక్రవారం ప్రారంభమైన ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో ఇరు జట్ల పేసర్లు చెలరేగడంతో తొలి రోజే 20 వికెట్లు నేలకూలాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.

మైఖెల్ నెసర్(35), ఉస్మాన్ ఖవాజా(29), అలెక్స్ క్యారీ(20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(5/45) ఐదు వికెట్లతో చెలరేగగా.. గస్ అట్కిన్సన్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్‌కు చెరో వికెట్ దక్కింది.

Ashes Australia Take Narrow Lead as 20 Wickets Tumble on Day One of Boxing Day Test Against England

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 29.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్(41), బెన్ స్టోక్స్(16), గస్ అట్కిన్సన్(28) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జాక్ క్రాలీ(5), బెన్ డకెట్(2), జాకోబ్ బెతెల్(1), జో రూట్(0), జేమీ స్మిత్(2), విల్ జాక్స్(5), బ్రైడన్ కార్స్(4) తీవ్రంగా నిరాశపర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైఖెల్ నెసర్(4/45) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్(3/30) మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

42 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌ను ఆసీస్ 3-0తో కైవసం చేసుకుంది. చివరి రెండు టెస్ట్‌లను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మరోవైపు కనీసం రెండు మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

Story first published: Friday, December 26, 2025, 15:01 [IST]
Other articles published on Dec 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+