Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs ENG: పట్టుబిగించిన ఆసీస్.. చేతులెత్తేసిన ఇంగ్లండ్!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ ఆస్ట్రేలియా పట్టుబిగించింది. ముందుగా బ్యాటింగ్‌లో సత్తా చాటిన ఆసీస్.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ చెలరేగింది. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 68 ఓవర్లలో 8 వికెట్లకు 213 పరుగులు చేసింది.

కెప్టెన్ బెన్ స్టోక్స్(45 బ్యాటింగ్‌)తో పాటు జోఫ్రా ఆర్చర్(30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్(45) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్, నాథన్ లయన్ రెండేసి వికెట్లు తీసారు. కామెరూన్ గ్రీన్‌కు ఒక వికెట్ దక్కింది.

Ashes Adelaide Test Day 2 Pat Cummins and Nathan Lyon Lead Australia s Dominance

అంతకుముందు 326/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. 91.2 ఓవర్లలో 371 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ(106) త్వరగానే ఔటవ్వగా.. మిచెల్ స్టార్క్(54) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాథన్ లయన్(9) విఫలమవ్వగా.. స్కాట్ బోలాండ్(14 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(5/53) ఐదు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, విల్ జాక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జోష్ టంగ్‌కు ఓ వికెట్ దక్కింది. ఇంగ్లండ్ ఇంకా 158 పరుగుల వెనుకంజలో ఉంది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-2తో వెనుకంజలో నిలిచింది.

Story first published: Thursday, December 18, 2025, 17:49 [IST]
Other articles published on Dec 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+