For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs ENG: ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఆసీస్ ఆధిపత్యం!

ప్రతిష్టాత్మక యాషెస్ 2025-26 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లోనూ ఆసీస్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ట్రావిస్ హెడ్(87 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్) విధ్వంసకర బ్యాటింగ్‌తో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 34.1 ఓవర్లలో 2 వికెట్లకు 166 పరుగులు చేసింది.

మరో ఓపెనర్ జేక్ వెదరాల్డ్(36 బంతుల్లో 4 ఫోర్లతో 21) నిరాశపర్చగా.. మార్నస్ లబుషేన్(68 బంతుల్లో 7 ఫోర్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మైఖేల్ నెజర్( 1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీసాడు. ప్రస్తుతం ఆసీస్ 218 పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు 211/3 ఓవర్‌‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ జోరూట్(242 బంతుల్లో 15 ఫోర్లతో 160) భారీ శతకంతో చెలరేగగా.. హ్యారీ బ్రూక్(97 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 84) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

Ashes 5th Test Travis Head s 91 Backs Joe Root s 160 as Australia Mount Strong Reply in Sydney

జెమీ స్మిత్(76 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 46) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(0) డకౌటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైఖేల్ నెజర్(4/60) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టాడు. కామెరూన్ గ్రీన్, మార్నస్ లబుషేన్ తలో వికెట్ తీసారు.

ఈ సిరీస్‌ను ఆసీస్ 3-1తో ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆసీస్ వరుసగా మూడు గెలవగా.. ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌లో గెలిచి పరువు కాపాడుకుంది. ఆఖరి టెస్ట్‌లో ఇరు జట్లు సమంగా దూసుకెళ్తున్నాయి. మూడో రోజు ఆటలో మ్యాచ్ గమనం ఏంటో తేలిపోనుంది. ఆసీస్ త్వరగా ఆలౌటైతే ఇంగ్లండ్‌కు విజయవకాశాలు ఉంటాయి. క్రీజులో నిలదొక్కుకొని భారీ స్కోర్ చేస్తే ఆసీస్‌కు గెలుపు అవకాశాలు పెరుగుతాయి.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 384 ఆలౌట్

ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 166/2 (ట్రావిస్ హెడ్ 91 బ్యాటింగ్, మైఖేల్ నెజర్ 1 బ్యాటింగ్)

Story first published: Monday, January 5, 2026, 15:35 [IST]
Other articles published on Jan 5, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+