Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 5th Test: ఇంగ్లండ్‌దే బ్యాటింగ్.. ఆసీస్‌లో కీలక మార్పు!

ఓవల్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన కమిన్స్ కామెరూన్ గ్రీన్ స్థానంలో టాడ్ మర్ఫీ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. నాథన్ లయన్‌ను చాలా మిస్సవుతున్నామని చెప్పిన కమిన్స్.. మర్ఫీ అతని లోటును తీరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Ashes 5th Test

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ అన్నాడు. ఆసీస్.. యాషెస్ గెలవాలనుకుంటోందని, తాము వారి విజయాన్ని అడ్డుకుంటామని తెలిపాడు. ఇప్పటికే తాము ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించామని చెప్పాడు. వర్షం కారణంగా నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఇంగ్లండ్ ఈ సిరీస్‌ను గెలిచే అవకాశాన్ని కోల్పోయింది.

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు గెలిచిన ఆస్ట్రేలియా 2-1తో లీడ్‌లో ఉంది. మూడో టెస్ట్ గెలిచిన ఇంగ్లండ్.. నాలుగో టెస్ట్‌లో వర్షం కారణంగా విజయాన్నందుకోలేకపోయింది. దాంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఇంగ్లండ్ చివరి టెస్ట్ గెలిచినా సిరీస్ గెలుచుకునే అవకాశం లేకపోయింది.

ఒకవేళ ఇంగ్లండ్ చివరి టెస్ట్‌ గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియానే ట్రోఫీని రిటైన్ చేసుకోనుంది.

తుది జట్లు:
ఇంగ్లండ్: జాక్‌ క్రాలీ, బెన్ డక్కెట్, మొయిన్ అలీ, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, టాడ్ మర్ఫీ, జోష్ హజెల్‌వుడ్

Story first published: Thursday, July 27, 2023, 15:55 [IST]
Other articles published on Jul 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+