Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs ENG: శతక్కొట్టిన అలెక్స్ క్యారీ.. ఆస్ట్రేలియా భారీ స్కోర్!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇప్పటికే వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచి 2-0తో ఆధిక్యంలో నిలిచిన ఆసీస్.. అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ శుభారంభం అందుకుంది. అలెక్స్ క్యారీ(143 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 106) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 83 ఓవర్లలో 8 వికెట్లకు 326 పరుగులు చేసింది.

ఉస్మాన్ ఖవాజా(126 బంతుల్లో 10 ఫోర్లతో 82) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రీజులో మిచెల్ స్టార్క్(33 బ్యాటింగ్)‌తో పాటు నాథన్ లయన్(0 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/29) మూడు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, విల్ జాక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జోష్ టంగ్‌కు ఓ వికెట్ దక్కింది.

Ashes 3rd Test Day 1 Alex Carey s Century Powers Australia Past 300 at Stumps

విఫలమైన ఓపెనర్లు..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో జేక్ వెధరాల్డ్(18) ఔటవ్వగా.. ఆ మరుసటి ఓవర్‌లోనే డేంజరస్ ట్రావిస్ హెడ్‌(10)ను బ్రైడన్ కార్స్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖావాజా ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. దాంతో ఆసీస్ 94/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

ఆదుకున్న ఖవాజా..

రెండో సెషన్ తొలి ఓవర్‌లోనే మార్నస్ లబుషేన్(19)‌ను ఆర్చర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్ మూడో బంతికి కామెరూన్ గ్రీన్(0) డకౌట్ చేశాడు. ఐపీఎల్‌లో రికార్డ్ ధర పలికిన గ్రీన్.. మరుసటి రోజే తీవ్రంగా నిరాశపర్చాడు. అలెక్స్ క్యారీతో కలిసి ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా సాగిన అతన్ని విల్ జాక్స్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లీస్ మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను ముగించారు. దాంతో ఆసీస్ 194/5 స్కోర్ వద్ద టీ బ్రేక్‌కు వెళ్లింది.

అలెక్స్ క్యారీ సెంచరీ..

ఆఖరి సెషన్‌లో మరింత సాధికారికంగా బ్యాటింగ్ చేసి ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన జోష్ ఇంగ్లీస్‌ను టంగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(13) తీవ్రంగా నిరాశపర్చాడు. మిచెల్ స్టార్క్ సాయంతో అలెక్స్ క్యారీ 135 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు.

Story first published: Wednesday, December 17, 2025, 16:58 [IST]
Other articles published on Dec 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+