బర్మింగ్‌హామ్: ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ దూకుడుగా ఆడితే.. ఆస్ట్రేలియా సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఆరంభంలోనే కీలక వికెట్లను చేజార్చుకున్న ఆసీస్‌ను ఉస్మాన్ ఖవాజా (279 బంతుల్లో 14 ఫోర్లతో 2 సిక్స్‌లతో 126 బ్యాటింగ్) సెంచరీతో ఆదుకున్నాడు.
దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 311/5తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఖవాజాకు తోడుగా అలెక్స్ క్యారీ ( 80 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ (63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.

బ్రాడ్ డబుల్ స్ట్రోక్..:ఓవర్‌నైట్ స్కోరు 14/0తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వరుస బంతుల్లో డేవిడ్ వార్నర్(9), మార్నస్ లబుషేన్‌లను పెవిలియన్ చేర్చి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.
ఎక్కువ ఆఫ్‌స్టంప్ దిశగా బౌల్ చేసిన బ్రాడ్.. వార్నర్ (9), ఖవాజాలకు పరుగులు చేసే అవకాశం ఇవ్వలేదు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు భిన్నంగా ఆసీస్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. విసిగిపోయిన డేవిడ్ వార్నర్.. బ్రాడ్ ఓవర్లో ఓ చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. తర్వాతి బంతికే లబుషేన్ (0)ను ఔట్ చేసిన ఈ పేసర్.. ఆసీస్‌ను దెబ్బ కొట్టాడు.
ఫీల్డింగ్‌తో ఉక్కిరి బిక్కిరి..:భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో శతకంతో రాణించిన స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 16) ఎక్కువసేపే క్రీజులో ఉన్నా సౌకర్యంగా ఆడలేకపోయాడు. మూడు స్లిప్స్‌తో పాటు లెగ్ గల్లీలో ఇద్దరు ఫీల్డర్ల, షార్ట్ లెగ్‌లో మరో ఫీల్డర్‌ను పెట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్.. స్మిత్‌పై ఒత్తిడి పెంచాడు. దాంతో బౌండరీలు బాదలేకపోయిన స్మిత్.. చివరికి స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
ట్రావిస్ హెడ్ జోరు..:67/3తో ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడగా.. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఖవాజాతో కలిసి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దాంతో ఆసీస్ బ్యాటర్ల కాస్త కుదురుకునే అవకాశం దక్కింది. అయితే మొదట హెడ్.. ఆ తర్వాత గ్రీన్ (38)లను స్పిన్నర్ మొయిన్ అలీ (2/124) ఔట్ చేసి ఆసీస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు.
బచాయించిన ఖవాజా..:ఆ జట్టు 220/5తో నిలిచింది. కానీ ఖవాజా జోరు తగ్గలేదు. అలెక్స్ క్యారీ సాయంతో జట్టు స్కోరు 300 ధాటించిన అతడు.. ఈ క్రమంలో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయి దాటిన కొద్దిసేపటికే బ్రాడ్ బౌలింగ్‌లో ఖవాజా బౌల్డ్ అయినా.. అది నోబాల్ కావడంతో బతికిపోయాడు.
మరోవైపు స్థిరంగా బ్యాటింగ్ చేసి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న క్యారీతో పాటు ఖవాజా ఆట చివరికి అజేయంగా నిలిచాడు. చేతిలో 5 వికెట్లు ఉన్న ఆ జట్టు ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 393/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.