లార్డ్స్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. గాయంతో జట్టుకు దూరమైన మొయిన్ అలీ స్థానంలో జట్టులోకి వచ్చిన జోష్ టంగ్ సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు శుభారంభం అందించాడు.
అసాధారణమైన బంతితో క్రీజులో సెట్ అయిన ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 66), ఉస్మాన్ ఖవాజా(70 బంతుల్లో 2 ఫోర్లతో 17)లను పెవిలియన్ చేర్చాడు. ఈ ఇద్దర్నీ టంగ్ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. అది కూడా అనూహ్యమైన స్వింగ్ బాల్‌తో ఔట్ చేయడం గమనార్హం.

ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని అని భావించిన ఉస్మాన్ ఖవాజా.. బంతిని వదిలేస్తూ ఆడగా టర్న్ అయిన బంతి అతని హాఫ్ వికెట్ గీరాటేసింది. డేవిడ్ వార్నర్‌కు వేసిన బంతి అయితే అతని బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి దూసుకెళ్లి మిడిల్ స్టంప్‌ను లేపేసింది. ఈ అనూహ్య బంతికి వార్నర్ నోరెళ్ల బెట్టాడు.
ప్రస్తుతం ఈ రెండు వికెట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. జోష్ టంగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టంగ్ వేసే ఇన్‌స్వింగర్స్ నాగినీ ఆడుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. అతని స్నేక్ బాల్స్‌కు బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయిందని ప్రశంసిస్తున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 2 వికెట్లు కోల్పేయే సరికి 92 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన మార్నస్ లుబుషేన్, స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే 54 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న ఈ జోడీ.. ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తోంది.
లబుషేన్ ఇచ్చిన స్లిప్ క్యాచ్‌ను ఇంగ్లండ్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఇది ఆ జట్టుకు కలిసొచ్చింది. 38 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్లకు 154 రన్స్ చేసింది.