Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఉదయించిన సూరీడు.. గెలిచేది ఎవరో?

బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఫలితం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. చివరి రోజుకు ఆటంక కలిగించిన వరుణుడు ఎట్టకేలకు విరామం ఇచ్చాడు. కారు మబ్బులను చీల్చుకుంటూ సూరీడు ఉదయించాడు.

దాంతో గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్దం చేయగా.. ఆటను ప్రారంభించేందుకు అంపైర్లు సిద్దమయ్యారు. మరికొద్ది సేపట్లో చివరి రోజు ఆట ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒక సెషన్నర ఆట తుడిచిపెట్టుకుపోయింది. మరీ మిగతా సెషన్నరలో ఫలితం తేలుతుందా? తేలితే విజయం ఎవర్నీ వరిస్తోంది? అనే ప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

The sun is out now at the Edgbaston

ఫలితం ఎలా ఉన్నా.. ఇరు జట్ల మధ్య జరిగే రసవత్తపోరు అభిమానులకు కావాల్సిన మజా అందివ్వనుంది. ఆసీస్ విజయానికి ఇంకా 174 రన్స్ అవసరం కాగా.. ఇంగ్లండ్ విజయానికి ఏడు వికెట్లు కావాలి. వర్షం కారణంగా పిచ్ చాలా సేపు కవర్ల కింద ఉండటంతో బౌలర్లకు అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. పిచ్ నుంచి లభించే సహకారాన్ని అందిపుచ్చుకొని ఇంగ్లండ్ చెలరేగితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు.

తొలి 20 ఓవర్లు కాస్త ఓపికగా ఆడితే ఆసీస్ విజయాన్నందుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 273 పరుగులకు కుప్పకూలింది. జోరూట్(46), హ్యారీ బ్రూక్(46), బెన్ స్టోక్స్(43) రాణించారు. బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో వేగంగా ఆడే క్రమంలో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం కలుపుకొని ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యం నమోదు చేసింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 107/3 స్కోర్‌తో నిలిచింది. అయితే వర్షం రావడం ఇంగ్లండ్ జట్టుకు కలిసొచ్చిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వర్షం అంతరాయం లేకుండా చివరి రోజు ఆట కొనసాగితే ఆసీస్ సునాయసంగా గెలిచేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బజ్‌బాల్ బచాయించిందని సెటైర్లు పేల్చుతున్నారు.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 273 ఆలౌట్

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 107/3

Story first published: Tuesday, June 20, 2023, 18:32 [IST]
Other articles published on Jun 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+